ETV Bharat / bharat

తుక్కు నుంచి రాజ్​దూత్ బైక్ తయారీ.. కొడుకు కోసం స్పెషల్​గా.. - రిషి కపూర్ రాజ్​దూత్ బైక్

Bihar mini rajdoot: తుక్కు నుంచి అద్భుతమైన బైక్ తయారు చేశాడు ఓ మెకానిక్. ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఉత్పత్తి ఆపేసిన రాజ్​దూత్ బైక్​ను.. పనికిరాని వస్తువులతో రూపొందించాడు. దాన్ని తన కొడుకుకు గిఫ్ట్​గా ఇచ్చాడు.

Bihar mini rajdoot
Bihar mini rajdoot
author img

By

Published : Apr 10, 2022, 1:12 PM IST

Updated : Apr 10, 2022, 4:04 PM IST

Bihar mini rajdoot: బిహార్​లోని పట్నాకు చెందిన మెకానిక్ అద్భుతం చేశాడు. 39 ఏళ్ల క్రితం భారత్​లో ఉత్పత్తిని నిలిపివేసిన రాజ్​దూత్ వాహనాన్ని పనికిరాని వస్తువులతో రూపొందించాడు. తనకు ఉన్న పరిమిత వనరులతో ద్విచక్రవాహనాన్ని తయారు చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

పట్నాలో 'మోహన్ బుల్లెట్' అనే బైక్ రిపేర్ షాప్​ను నడిపిస్తున్న మహ్​తాబ్.. రిషికపూర్ నటించిన అలనాటి బాబీ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఈ బైక్​ను తయారు చేశాడు. ఇందుకు మహ్​తాబ్ తండ్రి కూడా సహకరించాడు. తండ్రి ప్రోత్సాహంతో.. మహ్​తబ్ పాడైపోయిన బైక్​ల విడిభాగాలను సేకరించి.. రెండు నెలల్లో రాజ్​దూత్ వాహనాన్ని రూపొందించాడు. దీన్ని ఎనిమిదేళ్ల తన కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు. అయితే, ఇప్పుడే తన కొడుకు నడపడం లేదని చెప్పాడు.

mini rajdoot bike
మహ్​తాబ్ రూపొందించిన బైక్
mechanic mahtaab
మెకానిక్ మహ్​తాబ్

"పట్నాలో చిన్న బైక్​లు కనిపించడం లేదు. అందుకే దీన్ని నా కుమారుడి కోసం తయారు చేశా. ఇప్పుడు నా కొడుకు చిన్నగా ఉన్నాడు. అందుకే దీన్ని అలాగే ఖాళీగా ఉంచా. ఇతర వాహనాలకు చెందిన విడిభాగాలతో దీన్ని రూపొందించా. ఇది 1985 మోడల్​ను పోలిన బైక్. 40 కిలోల బరువు ఉంటుంది. ఎక్కడకు వెళ్లినా దీని గురించి అందరూ ప్రశ్నిస్తారు. ఇది ఎలా వచ్చింది. నాకు విక్రయిస్తారా అని అడుగుతారు. దిల్లీ నుంచి వచ్చి దీన్ని అమ్మాలని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు."

-మహ్​తాబ్, మినీబైక్ సృష్టికర్త

మినీ బైక్ కోసం రూ.30-40 వేలు వెచ్చించాడు మహ్​తాబ్. అన్ని పరికరాలు అమర్చి.. అందంగా పెయింట్ వేశాడు. బైక్ బరువు 40 కేజీలేనని.. సులభంగా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని మహ్​తాబ్ చెబుతున్నాడు. లీటర్ పెట్రోల్​కు 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోందని చెప్పాడు. ఈ బైక్​ను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

mini rajdoot bike
మినీ రాజ్​దూత్ బైక్

ఇదీ చదవండి: నడిరోడ్డుపైనే తల్లిదండ్రులను నరికేసిన కుమారుడు.. ఎందుకంటే?

Last Updated : Apr 10, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.