ETV Bharat / bharat

'నా భార్యనే పెళ్లి చేసుకుంటావా.. ఇకపై నీ పెళ్లాం నా సొంతం!' - కగారియాలో వింతైన పెళ్లి వార్తలు

తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతడి భార్యను వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తి. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఈ ఘటన బిహార్​లో వెలుగు చూసింది.

Bihar Khagaria Unique Marriage
బిహార్ కగారియాలో వింతైన పెళ్లి
author img

By

Published : Feb 27, 2023, 10:21 PM IST

బిహార్​లోని ఖగాడియా జిల్లాలో ప్రేమ, పగలతో కూడిన ఓ వింత వివాహాల ఘటన వెలుగు చూసింది. కొంతకాలం తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించి, చివరకు పెళ్లి చేసుకున్నాడనే పగతో ఆ వ్యక్తి భార్యను వివాహం చేసుకున్నాడు బాధిత భర్త. వినడానికి వింతగా ఉన్నా.. ప్రస్తుతం ఈ వార్త అంతటా చర్చనీయాంశమవుతోంది.

పోలీసులు వివరాలు..
ఖగాడియా జిల్లాలోని హర్దియా గ్రామానికి చెందిన నీరజ్​... పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లికి ముందు నీరజ్​ భార్య పస్రాహా గ్రామానికి చెందిన ముకేశ్​ అనే వ్యక్తితో చనువుగా ఉండేదని.. అది కాస్త ప్రేమగా మారి అనైతిక సంబంధానికి దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. అయితే రూబీ నీరజ్​ను వివాహం చేసుకున్న తర్వాత కూడా ముకేశ్​తో సంబంధాన్ని అలాగే కొనసాగించింది. ఇకపోతే, అప్పటికే ముకేశ్​.. అమ్నీ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కూడా రూబీనే కావడం విశేషం. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Bihar Khagaria Unique Marriage
స్థానిక శివాలయంలో పెళ్లి తర్వాత పూజలు చేస్తున్న నీరజ్​, రూబీ దంపతులు

అయితే గతేడాది ఫిబ్రవరిలో నీరజ్​ భార్య రూబీ దేవి, ముకేశ్​లు ఊరు విడిచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నీరజ్​.. పోలీస్ స్టేషన్‌లో ముకేశ్​పై కిడ్నాప్​ కేసు పెట్టాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా ముకేశ్​ తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితుడు నీరజ్​ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన భార్య రూబీ దేవి, ముకేశ్​లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నీరజ్​ ఏకంగా ముకేశ్​ భార్యతో వివాహేతర సంబంధాన్ని ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఈ నెల 18న స్థానిక ఆలయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఇందులో సరదా విషయమేంటంటే ఇద్దరి భర్తల భార్యల పేర్లు కూడా రూబీనే. ఇకపోతే నీరజ్ ప్రముఖ టాటా కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేశ్​ దినసరి కూలీ.

Bihar Khagaria Unique Marriage
రూబీ, నీరజ్​

ఆయనకు 21.. ఆమెకు 41
మరోవైపు, 21 వ్యక్తి.. 41 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలియడం వల్ల వాళ్లే దగ్గరుండి మరీ ఇద్దరిని ఒక్కటి చేశారు. ఈ అరుదైన ఘటన పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.