ETV Bharat / bharat

Bihar Education Minister Controversy : 'రాముడు కలలో కన్పించి.. అలా చేయమని చెప్పాడు'.. బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 8:40 AM IST

Bihar Education Minister Controversy Comments : బిహార్​ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాముడు తన కలలోకి వచ్చాడని తెలిపారు చంద్రశేఖర్​. మార్కెట్లో తనను విక్రయించకుండా చూడమని కోరినట్లు పేర్కొన్నారు. సూపాల్​ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

bihar-education-minister-controversy-comments-says-lord-ram-came-in-my-dream
రాముడిపై బిహార్ విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు

Bihar Education Minister Controversy Comments : రాముడు తన కలలోకి వచ్చాడన్నారు బిహార్​ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌. మార్కెట్లో తనను విక్రయించకుండా చూడమని భగవంతుడు తనను కోరినట్లు తెలిపారు. బిహార్‌.. సుపాల్​ జిల్లాలోని రాంపుర్‌ గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"ప్రజలు తనని మార్కెట్లో విక్రయిస్తున్నారని రాముడు నాతో చెప్పారు. అలా జరగకుండా తనను రక్షించమని కోరారు. రాముడు సైతం శబరి ఎంగిలి చేసిన ఆహారాన్ని తిన్నాడు. కానీ, నేటికీ శబరి కుమారుడికి ఆలయ ప్రవేశం నిషిద్ధమే. ఇది విచారకరం. రాష్ట్రపతి, ముఖ్యమంత్రిని కూడా ఆలయాలను సందర్శించకుండా అడ్డుకున్నారు. దేవాలయాలను గంగా జలంతో శుద్ధి చేశారు. శబరి ఇచ్చిన ఆహారాన్ని దేవుడే తిన్నాడు. కుల వ్యవస్థ పట్ల ఆయన కూడా అసంతృప్తి చెందారు." అని చంద్రశేఖర్​ పేర్కొన్నారు. దేశంలోని కుల వ్యవస్థ, మత విశ్వాసాలు, చారిత్రక వ్యక్తుల గురించి చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదంగా మారాయి.

పొటాషియం సైనేడ్‌తో రామాయణాన్ని పోల్చిన చంద్రశేఖర్​..
గతవారం రామాయణాన్ని పొటాషియం సైనేడ్‌తో పోల్చారు చంద్రశేఖర్‌. దీంతో ఆ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. అది తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదన్నారు. హిందీ రచయిత నాగార్జున, సోషలిస్టు నేత రామ్‌ మనోహర్‌ లోహియా వంటి ప్రముఖులు సైతం.. రామయణ గ్రంథంలో తిరోగమన ఆలోచనలున్నాయని చెప్పారన్నారు. కుల వివక్షపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దూషణలకు దిగారని పేర్కొన్నారు. భౌతిక దాడులకు పాల్పడతామనే బెదిరింపులు కూడా వచ్చాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.