ETV Bharat / bharat

బిహార్ అసెంబ్లీలో గందరగోళం- ఎమ్మెల్యేలపై దాడి! - bihar

బిహార్​ అసెంబ్లీలో భీభత్స వాతావరణం నెలకొంది. బిహార్​ ప్రత్యేక సాయుధ పోలీస్ బిల్​-2021కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ఉద్రిక్తకరంగా మారింది. తమపై భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారని పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆరోపించారు.

BIHAR assembly
బిహార్ అసెంబ్లీలో గందరగోళం.. ఎమ్మెల్యేలపై దాడి!
author img

By

Published : Mar 23, 2021, 7:35 PM IST

Updated : Mar 23, 2021, 8:35 PM IST

బిహార్​ అసెంబ్లీలో మంగళవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బిహార్​ ప్రత్యేక సాయుధ పోలీస్ బిల్​-2021కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు శాసనసభలో చేసిన ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. వారెంట్ లేకుండా అరెస్టు, కస్టడీ మరణాలు లాంటి విషయాల్లో పోలీసులకు కొత్త బిల్లు విచ్చలవిడి స్వేచ్ఛ, శిక్ష నుంచి మినహాయింపు కల్పిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ప్రతిపక్షాల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదాపడింది. తొలుత చర్చ ప్రారంభంకాగానే ఆర్జేడీ, సీపీఐ-ఎంఎల్, కాంగ్రెస్ నేతలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును నల్ల చట్టంగా పేర్కొంటూ ప్రతులను చించేశారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు.

సభ్యులను స్పీకర్ ఎంత శాంతింపజేసినా నిరసనలు ఆగలేదు. దీంతో సభను వాయిదా వేశారు. అయితే సభ్యులను అదుపుచేసే క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది తమపై దాడి చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

  • Patna: Opposition MLAs protesting in Bihar Assembly against Bihar Special Armed Police Bill 2021, allege that they were manhandled by the security personnel present in the Assembly

    "The SP has hit me on my chest. This is the murder of democracy," says a Bihar MLA Satyendra Kumar pic.twitter.com/dDawg1yr62

    — ANI (@ANI) March 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎస్పీ తనపై చేయి చేసుకున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారని ఎమ్మెల్యే సత్యేంద్ర కుమార్ ఆరోపించారు.

  • #WATCH RJD MLA Satish Kumar carried on a stretcher from Bihar Assembly after he was allegedly manhandled by "police and local goons" inside the Assembly during protest against Bihar Special Armed Police Bill 2021.
    "See how an elected representative was treated today," he says pic.twitter.com/WlJe1ly6DH

ఆర్జేడీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్​ను అసెంబ్లీ నుంచి స్ట్రెచర్​పై తీసుకెళ్లారు. తనపై పోలీసులు, స్థానిక గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులతో ఎలా వ్యవహరిస్తున్నారో చూడండని ఆవేదన వ్యక్తం చేశారు.

  • #WATCH Bihar: Women MLAs of the Opposition being carried out of the Assembly building by women security personnel. They (MLAs) were refusing to allow Assembly Speaker Vijay Kumar Sinha to step out of his chamber. pic.twitter.com/Skj0LayFs4

ఈ క్రమంలో స్పీకర్​ విజయ్ కుమార్​ సిన్హాను తన ఛాంబర్​ నుంచి బయటకు రానివ్వకుండా మహిళా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. మహిళా భద్రతా సిబ్బంది వారిని అక్కడినుంచి ఈడ్చుకెళ్లారు.

ఇదీ చూడండి: 'అధికారంలోకి వస్తే పేదల ఖాతాల్లోకి రూ.72వేలు'

Last Updated : Mar 23, 2021, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.