కర్ణాటక చిత్రదుర్గలో మూడు నెలల క్రితం కలకలం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు(chitradurga crime news). ఆనాడు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మరణించగా.. అందుకు కారణం ఆ కుటుంబంలోని బాలిక అని తేలింది(karnataka crime news).
ఇదీ జరిగింది...
2021 జులై 12న భరంసాగర్ హొబ్లి ప్రాంతంలోని ఇసముద్ర లబనిహల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని.. కుటుంబ పెద్ద టిప్పా నాయక్(45), అతడి తల్లి గుండిభాయ్(80), భార్య సుధాభాయ్(40), కూతురు రమ్య(16) ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు రాహుల్(19) తీవ్ర అనారోగ్యం కారణంగా మరణం అంచువరకు వెళ్లి బయటపడ్డాడు. ఆ రోజు రాత్రి చేసిన రాగిముద్ద తినడం ఈ ఘటనకు కారణం.
రాహుల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చిత్రదుర్గ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ రోజు రాత్రి చేసిన ఆహారాన్ని, వంటకు ఉపయోగించిన పాత్రలను స్థానిక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వంటలో పురుగుల మందు కలిపినట్టు పరీక్షల్లో బయటపడింది.
ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు.. నిజాన్ని తెలుసుకునే క్రమంలో షాక్ తగిలింది. టిప్ప నాయక్‌కు రమ్య, రాహుల్‌తో పాటు 17ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆమె ఆహారంలో పురుగుల మంది కలిపిందని తేలింది. మైనర్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. జువెనైల్ హోంకు తరలించారు(daughter kills parents).
అసలు ఆమె అలా ఎందుకు చేసింది? అన్న కోణంలో మైనర్‌ను విచారించారు అధికారులు. 'మా తల్లిదండ్రులు నన్ను రోజూ పనికి పంపేవారు. నన్ను ఆ కుటుంబం సరిగ్గా చూసుకోలేదు. నా సోదరి, సోదరుడే వారికి ముఖ్యం. నన్ను పట్టించుకోలేదు. అందుకే చంపేశాను' అని జవాబిచ్చింది ఆమె.
ఇదీ చూడండి:- కాలకృత్యాలకు వెళ్లిన బాలికపై హత్యాచారం!