ETV Bharat / bharat

భీకర ఎన్​కౌంటర్.. ముగ్గురు నక్సల్స్​ హతం - maoist encounter in madhya pradesh

Maoist encounter in Madhya Pradesh: మధ్యప్రదేశ్​ బాలాఘాట్ జిల్లాలోని అడవుల్లో భద్రతా దళాలు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ధృవీకరించారు.

maoist encounter in madhya pradesh
maoist encounter in madhya pradesh
author img

By

Published : Jun 20, 2022, 2:19 PM IST

Maoist encounter in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒక మహిళ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ముగ్గురు మావోలపై మొత్తంగా రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

encounter in madhya pradesh
ఘటనా స్థలంలో తుపాకులు

'మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ జిల్లా బహేలా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. వారి ముగ్గురిపైనా రివార్డ్‌ ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది' అని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా పేర్కొన్నారు. చనిపోయిన వారిలో డివిజినల్‌ కమిటీ సభ్యుడు నగేష్‌పైన రూ.15లక్షల రివార్డు ఉండగా.. ఏరియా కమాండర్‌ మనోజ్‌తోపాటు రమే అనే మహిళపై చెరో ఎనిమిది లక్షల క్యాష్‌ రివార్డు ఉన్నట్లు వివరించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తోన్న ప్రత్యేక దళాలు ఇందులో పాల్గొన్నట్లు హోంమంత్రి వెల్లడించారు.

  • बालाघाट जिले के बहेला थाना इलाके में पुलिस-नक्सली मुठभेड़ में 3 इनामी नक्सली मारे गए हैं।

    हॉक फोर्स ने मुठभेड़ में नक्सलियों के डिवीजनल कमेटी के मेंबर और 15 लाख के इनामी नक्सली नागेश और 8-8 लाख के इनामी एरिया कमांडर नक्सली मनोज और रामे को ढेर किया है।

    पूरी पुलिस टीम को बधाई। pic.twitter.com/jeO7Cw6HhQ

    — Dr Narottam Mishra (@drnarottammisra) June 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: 'అగ్నివీరుల'కు ఆనంద్​ మహీంద్రా బంపర్​ ఆఫర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.