BIDAR NARSIMHA TEMPLE: కర్ణాటక, బీదర్ సమీపంలోని మణిచోళ పర్వత శ్రేణుల్లోని గుహలో ఉన్న నరసింహస్వామి ఆలయం నాలుగేళ్ల తర్వాత తెరుచుకుంది. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే 300 మీటర్ల మేర సొరంగంలో పీకల్లోతు నీళ్లలో వెళ్లాల్సి ఉంటుంది. సొరంగంలో నీరు ఎక్కువవడం వల్ల నాలుగేళ్ల క్రితం ఆలయాన్ని మూసివేశారు ఆధికారులు.
ఈ ఆలయం ఎక్కడుంది?
బీదర్ నగరం నుంచి 4.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణిచోళ కొండ శ్రేణి క్రింద 300 మీటర్ల సొరంగంలో ఈ పురాతన ఆలయం ఉంది. నీరు ఎల్లప్పుడూ ఈ సొరంగం గుండా ప్రవహిస్తుంది. నరసింహుని దర్శనం కోసం భక్తులు నీటిలో నడుచుకుంటూ వెళ్తారు.
ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు
ఆక్సిజన్‌తో పాటు నీరు అధికమవ్వడం కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా ఆలయాన్ని మూసివేశారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభణ కూడా కారణమైంది.
ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం గుహ దేవాలయంలో లైటింగ్ సిస్టమ్ అమర్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలవరకు ఆలయం తెరచి ఉంటుంది. కర్ణాటకలోని వివిధ జిల్లాలు తోపాటు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి స్వామి వారిని పూజిస్తుంటారు.
ఇదీ చదవండి: మేడారం మహాజాతర - ప్రత్యక్ష ప్రసారం