BHEL Jobs 2023 : ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. బీహెచ్‌ఈఎల్, ఎయిమ్స్‌తో పాటు ఇండియన్ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేశాయి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ మొదటి వారంలోపు ఆన్‌లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవాలి.
1. BHEL Jobs 2023 : తమిళనాడులోని రాణిపేట్‌లో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఆధ్వర్యంలోని బాయిలర్ ఆక్సిలరీస్ ప్లాంట్‌లోని మెడికల్ కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించి ఉద్యోగ నోటిఫకేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 8 పీటీఎంసీ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
- మొత్తం ఖాళీలు..
8 పోస్టులు - పోస్టులు..
పార్ట్‌టైమ్ మెడికల్ కనసల్టెంట్స్(పీటీఎంసీ), పీటీఎంసీ స్పెషలిస్ట్. - వయసు..
65-70 ఏళ్లు ఉండాలి. - విద్యార్హతలు..
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - విభాగాలు..
పెడియాట్రిక్స్, ఆర్థోపెటిక్స్, ఫిజిషియన్. - జీతం..
గంటకు రూ.350-రూ.790 వరకు రెమ్యునరేషన్‌గా చెల్లిస్తారు. - ఎంపిక విధానం..
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. - దరఖాస్తు విధానం..
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. - దరఖాస్తు చివరి తేదీ..
2023 సెప్టెంబర్ 01
చిరునామా..
Sr. Dy. General Manager/HR, BHEL,BAP, Ranipet – 632406, Tamilnadu. ఈ అడ్రస్‌కు ఆఫ్‌లైన్‌లో సెప్టెంబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్..
మరింత సమాచారం కోసం https://www.bhel.com/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
2. AIIMS Jobs 2023 : ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 49 సీనియర్ రెసిడెంట్లు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను చేపట్టింది. దీనికి సంబంధించి ఓ ప్రకటన( AIIMS Jobs Rishikesh )ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇన్ని ఖాళీలు..
49 పోస్టులు - ఈ పోస్టులు..
సీనియర్ రెసిడెంట్లు (నాన్ అకడమిక్). - ఏజ్ లిమిట్..
45 ఏళ్లు ఉండాలి. - అర్హతలు..
సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్, ఎంఎస్సీ, మాస్టర్స్‌డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి. - డిపార్ట్మెంట్లు..
బయోకెమిస్ట్రీ, జనరల్ సర్జరీ, అనాటమి, ఫార్మకాలజీ, సైకియాట్రీ, సైకాలజీ, రేడియోథెరపీ, ఈఎన్‌టీ, న్యూక్లియర్ మెడిసిన్, పాథాలజీ ఇతర విభాగాలు. - అప్లికేషన్ ఫీజు..
రూ.1200/- - దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. - దరఖాస్తు చివరి తేదీ..
2023 సెప్టెంబర్ 06
వెబ్సైట్..
నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం https://aiimsrishikesh.edu.in వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.
3. Indian Bank Jobs 2023 : చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ స్పోర్ట్స్‌పర్సన్స్ కోటాలో భాగంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఈనెల 22 నుంచి ప్రారంభమయింది.
- మొత్తం ఖాళీలు..
11 పోస్టులు - పోస్టులు..
క్లర్క్, ఆఫీసర్ పోస్టులు. - వయసు..
18-26 ఏళ్లు ఉండాలి. - విద్యాఅర్హత..
12వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. - స్పోర్ట్స్ కోటా..
క్రికెట్, హాకీ, బాస్కెట్‌బాల్, వాలీబాల్. - జీతభత్యాలు..
నెలకు రూ.17,900-రూ.63,840 వరకు వేతనం చెల్లిస్తారు. - ఎంపిక విధానం..
స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. - దరఖాస్తు రుసుము..
రూ.700/- - దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. - దరఖాస్తు చివరి తేదీ..
2023 సెప్టెంబర్ 5 - వెబ్సైట్..
మరిన్ని వివరాల కోసం https://indianbank.in వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.
FCI Jobs 2023 : ఫుడ్ కార్పొరేషన్లో 5000 ఉద్యోగాలు.. వేలల్లో జీతం.. అప్లై చేసుకోండిలా!
Employment News 2023 : ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం.. ఆగస్టు 2023
FDDI Jobs : డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఎఫ్‌డీడీఐలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!