ETV Bharat / bharat

ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మందికి గాయాలు - factory blast

Factory Blast: గుజరాత్​లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు గాయాలపాలయ్యారు.

Factory Blast
Gujarat factory blast
author img

By

Published : Feb 13, 2022, 10:10 AM IST

Factory Blast: గుజరాత్​లోని భావ్​నగర్​ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. సిహోర్​ పట్టణానికి సమీపంలోని అరిహంత్​ ఫర్నేస్​ రోలింగ్​ మిల్​లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది.

అకస్మాత్తుగా పేలుడు జరిగిన సమయంలో కార్మికులు ఫ్యాక్టరీలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను భావ్​నగర్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మహారాష్ట్రలోనూ..

మహారాష్ట్ర ఠాణెలోని ఓ తుక్కు గోడౌన్​లోనూ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో 22 ఏళ్ల కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం అతడిని ముంబయికి తరలించారు.

ఇదీ చూడండి: కూలిన సొరంగం- శిథిలాల్లో చిక్కుకుపోయిన కూలీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.