స్వామి వివేకానందా, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్‌లు కలలుకన్న బంగారు బంగాల్‌ను తీసుకొస్తామని భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేందుకు ప్రజల నుంచి 2కోట్లకు పైగా సలహాల్ని తీసుకొనున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోకి సంబంధిచి 'లోకో సోనార్ బంగ్లా( బంగారు బంగాల్ సాధించటమే లక్ష్యం)' ప్రచారాన్ని కోల్‌కతాలోని భాజపా కార్యాలయంలో ప్రారంభిచారు.
ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు బంగాల్ వ్యాప్తంగా 30,000 పైగా సలహా బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 294 అసెంబ్లీ నియోజక వర్గాలలో వంద బాక్సులను ఉంచుతామని అన్నారు. 50 బాక్సులతో ఇంటింటికీ భాజపా కార్యకర్తలు తిరిగి సలహాలు తీసుకుంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యూహాత్మక నియోజకవర్గాలలో మరో 50 బాక్సులను ఉంచుతామని అన్నారు. మార్చి 3 నుంచి 20 వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు.
తృణమూల్‌పై మండిపడ్డ 'నడ్డా'
బంగాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అమలు చేయట్లేరని నడ్డా విమర్శించారు. దాని వల్ల రాష్ట్రంలో ఉన్న 73లక్షల మంది రైతులు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. నడ్డా సమక్షంలో బంగాల్ నటుడు పాయల్ సర్కార్ భాజపాలో చేరారు.
ఇదీ చూడండి: 'ఈగో వల్లే దీదీ 'పీఎం కిసాన్'ను ఆపేశారు'