ETV Bharat / bharat

Bharat vs India Debate : ఇండియా X భారత్.. దేశం పేరుపై 2016లోనే సుప్రీంకోర్టు క్లారిటీ.. ఏం చెప్పిందంటే? - భారత్ vs భారత్ వివాదం

Bharat vs India Debate : దేశం పేరు భారత్​ లేదంటే ఇండియా అని పిలుచుకోవడంపై 2016లో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. పౌరులు దేశాన్ని.. ఇండియా లేదంటే భారత్ అని తమకు నచ్చిన విధంగా పిలుచుకోవచ్చని ఆ సమయంలో స్పష్టం చేసింది. పేరు మార్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. 2016లో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

bharat-vs-india-debate-citizens-free-to-call-india-or-bharat-sc-said-while-dismissing-pil-in-2016
ఇండియా vs భారత్ పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 9:14 PM IST

Bharat vs India Debate : జీ20 విందు ఆహ్వాన పత్రికలో 'ప్రెసిడెంట్​ ఆఫ్​ ఇండియా'కు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్​ భారత్​ అని ముద్రించిన వేళ.. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ దుమారానికి సైతం దారితీసింది. ఈ నేపథ్యంలోనే 2016లో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పౌరులు దేశాన్ని.. ఇండియా లేదంటే భారత్ అని తమకు నచ్చిన విధంగా పిలుచుకోవచ్చని 2016లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పేర్లకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిల్​ దాఖలు కాగా.. దానిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

అధికారిక, అనధికారిక కార్యక్రమాలలో భారత్​ పేరును ఉపయోగించేలా దేశంలో ఉన్న ఎన్​జీఓలు, ఇతర కార్పొరేట్​ కంపెనీలకు ఆదేశాలివ్వాలని కోరుతూ.. మహారాష్ట్రకు చెందిన నిరంజన్ భట్వాల్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో ఓ పిల్ దాఖలు చేశాడు. భారత్​, హిందుస్థాన్​, హింద్​, భరత భూమి, భరత వర్ష వంటి పేర్లు దేశానికి పెట్టాలని రాజ్యాంగ సభ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయని పిటిషనర్​ గుర్తు చేశాడు.

దీనిపై విచారణ చేపట్టిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ టిఎస్ ఠాకూర్, జస్టిస్ యు యు లలిత్​తో కూడిన బెంచ్.. "భారత్​ లేదంటే ఇండియా. మీకు భారత్ అని పిలవాలనుంటే అలాగే పిలవండి. మరో వ్యక్తికి ఇండియా అనాలని ఉంటుంది. అతడ్ని అలాగే అననివ్వండి." అంటూ పిల్​ను కొట్టివేస్తూ వ్యాఖ్యానించింది. కాగా ఇండియాకు బదులుగా దేశాన్ని భారత్ అని పిలవాల్సిన అవసరం లేదని 2015 నవంబర్​లో సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1) ప్రకారం.. ఇండియా అంటే భారత్ అని, అది రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలని పేర్కొంది.

దిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో 2 రోజులపాటు జీ-20దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 9వ తేదీన విదేశీ అతిథులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం విందు ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాల్లో ప్రెసిండెంట్‌ ఆఫ్‌ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని ముద్రించారు. ఇలా చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

India Name Change Resolution : ఇండియా పేరు ఇక భారత్​గా మార్పు! త్వరలోనే కేంద్రం తీర్మానం!! విపక్షాల ఫైర్

Article 370 Supreme Court : ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.