మొబైల్ ఫోన్లు పేలిపోతున్నాయనే వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా జేబులోని ఫోన్ పేలి ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.
కోలార్ జిల్లా శ్రీనివాసపూర్ మండలం కొత్తపేట గ్రామంలో నివసిస్తున్న ఆర్.గంగాధర్ అనే వ్యక్తి ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు బయలుదేరాడు. తల్లితో పాటు బైక్‌పై వెళ్తుండగా తన ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. వారిద్దరూ కిందపడ్డారు. గంగాధర్ ఎడమకాలికి తీవ్రగాయాలయ్యాయి. అతని తల్లి కూడా గాయపడ్డారు.