ETV Bharat / bharat

'మోదీ 2.0 పాలనలో విజయాల పరంపర' - జేపీ నడ్డా మీడియా సమావేశం

మోదీ ప్రభుత్వం ఏడాది కాలంలోనే అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ కాలాన్ని 'కలల సాకార సంవత్సరం'గా అభివర్ణించారు. కరోనా సంక్షోభం విషయంలో భాజపా ఎన్నడూ రాజకీయం చేయలేదని.. కానీ కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా స్పందించిందని ఆరోపించారు.

ANNIVERSARY-NADDA
మోదీ 2.0
author img

By

Published : May 30, 2020, 1:41 PM IST

ఏడాది కాలంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఉద్ఘాటించారు. మోదీ 2.0 ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కాలంలో ఎన్నో అనుకోని సవాళ్లను ఎదుర్కొన్నామని, అయినా సమర్థంగా పాలన సాగించామని పేర్కొన్నారు.

కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ ముందుండి నడిపించారని నడ్డా అన్నారు. సరైన సమయానికి కఠిన నిర్ణయాలు తీసుకుని మహమ్మారిపై యుద్ధం సాగించారని కొనియాడారు. కరోనాపై పోరులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు మోదీ కృషి చేశారని చెప్పారు.

"అగ్రరాజ్యాలు కూడా కరోనా విషయంలో చేతులెత్తేశాయి. కానీ భారత్​లో ఇంకా పరిస్థితి అదుపులోనే ఉంది. కేంద్రం సరైన సమయంలో లాక్​డౌన్​ విధించి వ్యాధి సంక్రమణను నిలువరించగలిగింది. కానీ ఈ విషయంలో భాజపా ప్రభుత్వం ఎన్నడూ రాజకీయం చేయలేదు. కాంగ్రెస్ మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. దురదృష్టవశాత్తూ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీశాయి."

- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

60 ఏళ్లుగా భారత్​ ఎదుర్కొంటున్న సమస్యలను ఏడాది కాలంలోనే మోదీ ప్రభుత్వం పరిష్కరించిందని నడ్డా పేర్కొన్నారు.

"పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్​ 370 రద్దు, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల బలోపేతం, బ్యాంకుల విలీనం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకన్నారు. ఇవి దేశాన్ని బలోపేతం చేయటానికి సాయపడ్డాయి. 'ఒకే దేశం ఒకే రాజ్యాంగం' స్ఫూర్తిని కాపాడాయి. కానీ, అయోధ్య వంటి సున్నితమైన విషయాల్లో కాంగ్రెస్ చాలా ఆలస్యం చేసింది. ఇప్పుడు మోదీ సారథ్యంలో అయోధ్యలో భారీ రామ మందిరం నిర్మిస్తున్నాం."

- జేపీ నడ్డా

మోదీ 2.0 ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతా డిజిటల్ ర్యాలీలు చేపడుతామని నడ్డా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.