ప్రపంచంలోనే అతిపొడవైన రహదారి టన్నెల్‌ను ఈ నెల 29న ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ, లద్దాఖ్‌లోని లేహ్‌లను కలిపే ఈ రహదారిని మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరిట ఆవిష్కరించనున్నారు మోదీ.
టన్నెల్ రహదారి సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. వ్యూహాత్మకంగా ఈ మార్గం కీలకం కానుందన్న అధికారులు.. రహదారిలో ప్రతి 60 మీటర్ల దూరంలో ఒక సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతిష్టాత్మక టన్నెల్‌ను నిర్మించేందుకు తొలుత ఆరేళ్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ.. పూర్తి కావడానికి పదేళ్ల సమయం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం 2000 జూన్ 3న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నిర్ణయించారు.
అటల్ టన్నెల్ ప్రత్యేకతలివే..
- సముద్ర మార్గానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. టన్నెల్లో ప్రతి 60 మీటర్ల దూరంలో ఓ సీసీటీవీ కెమెరా ఏర్పాటు.
- టన్నెల్ కారణంగా మనాలీ, లేహ్ మధ్య సుమారు 46 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఫలితంగా 4గంటల సమయం ఆదా అవుతుంది.
- అటల్ టన్నెల్ వ్యయం 2000లో రూ.1,700 కాగా... 2020 సెప్టెంబర్ నాటికి అది రూ. 3,200 కోట్లకు పెరిగింది.
- అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రత్యేక ఫైర్ హైడ్రాంట్ల ఏర్పాటు.
- ప్రపంచంలో అతి పొడవైన ఈ టన్నెల్ వెడల్పు.. ఇరువైపులా నిర్మించిన కాలినడక దారి(1మీటర్)తో కలుపుకొని 10.5 మీటర్లు ఉంటుంది.
ఇదీ చదవండి: కళ్లు చెదిరే సొరంగ వ్యూహంతో చైనాకు భారత్ చెక్!