ETV Bharat / bharat

నారీమణుల చేతుల్లో మోదీ ట్విట్టర్, ఫేస్​బుక్​ ఖాతాలు

మహిళా దినోత్సవం సందర్భంగా తన సామాజిక మాధ్యమాల నిర్వహణను ఏడుగురు నారీమణులకు అప్పగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వీరంతా తమ విజయ గాథలను మోదీ ట్విట్టర్​, ఫేస్​బుక్​ ద్వారా పంచుకుంటున్నారు.

author img

By

Published : Mar 8, 2020, 12:24 PM IST

modi latest news
నారీమణుల చేతుల్లో మోదీ ట్విట్టర్, ఫేస్​బుక్​ ఖాతాలు

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీమణుల శక్తిని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం తన సామాజిక మాధ్యమాల నిర్వహణ బాధ్యతను జీవితంలో పోరాడి విజయం సాధించి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఏడుగురు మహిళలకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. వీరంతా తమ విజయగాథలను మోదీ ట్వీట్టర్​, పేస్​బుక్​ ఖాతాల ద్వారా తెలియజేస్తున్నారు. #SheInspiresUs హ్యాష్​ట్యాగ్​తో ఈ కార్యక్రమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రధాని. ఈ మహిళలు లక్షల మందికి ప్రేరణగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

వేల మంది ఆకలి తీరుస్తున్న స్నేహమోహన్​ దాస్​..

ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా ద్వారా మొదటగా తన విజయగాథను పంచుకునే అవకాశం స్నేహమోహన్​ దాస్​కు దక్కింది. ఒక్కపూట కడుపు నిండా భోజనానికి నోచుకోలేని ఎంతోమంది పేద, అభాగ్యులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు స్నేహ. నిరాశ్రయుల ఆకలి తీర్చాలనే గొప్ప ఆలోచన తన తల్లిని చూసి నేర్చుకున్నట్లు వివరించారు. తల్లే తన ఆదర్శమని చెప్పారు.

ఫుడ్​బ్యాంక్ ఇండియా పేరుతో కార్యక్రమాన్ని చేపట్టి విదేశీ వలంటీర్లు సహా ఎంతో మంది సహకారంతో పేదలకు ఆహారాన్ని అందజేస్తున్నట్లు స్నేహ పోస్ట్​ చేశారు.

  • You heard of food for thought. Now, it is time for action and a better future for our poor.

    Hello, I am @snehamohandoss. Inspired by my mother, who instilled the habit of feeding the homeless, I started this initiative called Foodbank India. #SheInspiresUs pic.twitter.com/yHBb3ZaI8n

    — Narendra Modi (@narendramodi) March 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాంబుపేలుడు నుంచి ప్రాణాలతో బయటపడి పీహెచ్​డీ

ఓ భీకర బాంబు దాడిలో గాయపడి 13ఏళ్లకే చేతులు కోల్పోయిన మాళవిక అయ్యర్.. మొక్కవోని దీక్షతో శ్రమించి పీహెచ్​డీ పూర్తి చేసినట్లు చెప్పారు. కాళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని రుజువు చేశారు. విశ్వాసం, ఆకాంక్షలతో తను అనుకున్నది సాధించినట్లు చెప్పుకొచ్చారు మాళవిక.

  • Acceptance is the greatest reward we can give to ourselves. We can’t control our lives but we surely can control our attitude towards life. At the end of the day, it is how we survive our challenges that matters most.

    Know more about me and my work- @MalvikaIyer #SheInspiresUs pic.twitter.com/T3RrBea7T9

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.