ETV Bharat / bharat

మహిళల నేతృత్వంలో రైతు ఆందోళనలు - రైతు సంఘం నాయకుడు టికాయత్

మహిళా రైతుల దినోత్సవం పేరుతో.. సాగు చట్టాల రద్దుపై ఉద్యమిస్తున్న రైతులకు నేతృత్వం వహించారు మహిళలు. ఈ నేపథ్యంలో సంబంధిత అన్ని పనులనూ వారే చూసుకున్నారు.

women farmers day
మహిళల నేతృత్వంలో రైతు అందోళన
author img

By

Published : Jan 19, 2021, 8:00 AM IST

వ్యయసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులకు సోమవారం మహిళలే నేతృత్వం వహించారు. 'మహిళా రైతుల దినోత్సవం' పేరుతో దిల్లీ సరిహద్దుల్లో నిరసనల శిబిరాల్లో అన్ని ఏర్పాట్లూ వారే చూసుకున్నారు. 50 రోజులుగా కొనసాగుతున్న దీక్షలో వివిధ రాష్ట్రాల మహిళలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వారిలో పలువురు ఒక రోజంతా కార్యక్రమాలను ముందుండి నడిపారు. సందర్శకులను నియంత్రించడం, సేవకుల మధ్య సమన్వయం, వృద్ధ రైతులకు సాయపడడం, విరాళాల సేకరణ, భోజన ఏర్పాట్లు వంటివన్నీ వారే చూసుకున్నారు. సింఘూ సరిహద్దు శిబిరంలో వక్తలంతా మహిళలే కావడం విశేషం.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలను అతివలే నిర్వహించారని 'అఖిల భారత రైతు పోరాట సమన్వయ సంఘం' నాయకురాలు కవిత కురుగంటి చెప్పారు. మరోవైపు వ్యవసాయ చట్టాల వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మంగళవారం తొలిసారి భేటీ కానుంది.

కేంద్ర విధానానికే రైతులు వ్యతిరేకం: టికాయిత్

పార్టీలను కాకుండా కేంద్ర విధానాలనే తాము వ్యతిరేకిస్తున్నామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. సోమవారం.. నోయిడాలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిరసనల్లో పాల్గొంటున్నవారిలో భాజపా మద్దతుదారులూ ఉన్నారని, పార్టీలకు అతీతంగా విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. డిమాండ్లను ఆమోదించిన తర్వాతే రైతుల వద్దకు ప్రధాని రావాలని, అప్పుడు తాము ఆయనకు ధన్యవాదాలు చెప్పి గౌరవించుకుంటామని తెలిపారు. తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఉద్యమం కొనసాగుతుందని దాని కోసం 2024 వరకైనా నిరీక్షిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:సాగు చట్టాలపై నేడు సుప్రీం నియమిత కమిటీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.