ETV Bharat / bharat

'కరోనమ్మా మమ్మల్ని కాపాడమ్మా' అంటూ పూజలు - bhilai latest news

కరోనాను దేవతగా కొలుస్తున్నారు ఛత్తీస్​గఢ్​​కు చెందిన మహిళలు. తమల్ని కాపాడాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే భౌతిక దూరం పాటించాలనే విషయం మాత్రం మరచిపోయారు.

Women in Bhilai worship Corona Mai to ward off virus
'కరోనమ్మా మమ్మల్ని కాపాడమ్మా' అంటూ పూజలు
author img

By

Published : Jun 7, 2020, 9:21 AM IST

Updated : Jun 7, 2020, 10:04 AM IST

లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనాను ప్రపంచమంతా మహమ్మారిగా అభివర్ణిస్తోంది. ఛత్తీస్​గఢ్​ భిలాయ్​లోని మహిళలు మాత్రం కరోనాను దేవతగా ఆరాధిస్తున్నారు. స్థానిక మహిళలు కొందరు బైకుంఠ డ్యామ్​ సమీపంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూరం, పూలు, లడ్డూలు సమర్పించారు.

Women in Bhilai worship Corona Mai to ward off virus
కరోనాను దేవతగా ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు

9 అంకెను పవిత్రంగా భావించి పూజలో 9 స్వీట్లు, 9 పువ్వులు, 9 వక్కలు, 9 లవంగాలు వినియోగించారు మహిళలు. పూజ పూర్తయ్యాక వీటన్నింటినీ గుంత తీసి పూడ్చారు. అయితే పూజ చేసే సమయంలో భౌతిక దూరం పాటించాలనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు.

కాపాడుతుందనే నమ్మకంతో..

కరోనా సోకిన రోగులు మరణించకుండా వైద్యులు చికిత్స అందించలేకపోతున్నారు, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్​ అభివృద్ధి చేయలేక పోతున్నారని పూజలో పాల్గొన్న మహిళలు చెప్పుకొచ్చారు. అందుకే కరోనాను దేవతగా కొలిచి తమ కుటుంబ సభ్యులకు వైరస్​ సోకకుండా కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఇలా చేస్తే తాము సురక్షితంగా ఉంటామంటున్నారు.

Last Updated : Jun 7, 2020, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.