మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఒక రోజు గడిచిపోవడం వల్ల మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున్న సమయంలో మేరున్నీస అబ్దుల్ హమీద్ కాజీ ప్రాణాలతో బయటపడటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమెను సురక్షితంగా బయటకు తీసిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. ఇదే ఘటనలో ఓ నాలుగేళ్ల బాలుడు 18 గంటల తర్వాత క్షేమంగా బయటపడ్డాడు.
16 మంది మృతి..
రాయ్‌గఢ్ జిల్లా కాజల్‌పురా ప్రాంతం మహద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాదాపు 90 మందికిపైగా భవన శిథిలాల కింద చిక్కుకుపోగా ఇప్పటివరకు 61 మందిని సహాయక బృందాలు కాపాడాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. బిల్డర్‌తోపాటు ఆర్కిటెక్ట్‌పై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: పుల్వామా దాడి: పాక్‌లో వ్యూహం- అఫ్గాన్‌లో శిక్షణ