ETV Bharat / bharat

యూపీ అత్యాచార బాధితురాలు దిల్లీలో మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి.. దిల్లీ ఆస్పత్రిలో మరణించింది. ఈ మేరకు హత్రాస్​ ఎస్పీ​ వెల్లడించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని యోగి సర్కార్​ను డిమాండ్​ చేశారు.

Woman gang-raped in Hathras dies in Delhi hospital
యూపి అత్యాచార బాధితురాలు దిల్లీలో మృతి
author img

By

Published : Sep 29, 2020, 12:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని హత్రాస్​లో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి మృతిచెందింది. 19ఏళ్ల ఆమె దిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 3గంటలకు మరణించినట్టు హత్రాస్​ ఎస్పీ విక్రాంత్​ వీర్​ తెలిపారు.

ఇదీ జరిగింది..

సెప్టెంబర్​ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని తొలుత యూపీ అలీగఢ్​లోని జవహర్​లాల్​ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్​ జంగ్​ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు కారణమైన నలుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్​ చేశారు పోలీసులు.

మహిళల భద్రతకు మీరే బాధ్యులు: ప్రియాంక

ఈ ఘటనపై స్పందిస్తూ యూపీ ప్రభుత్వం​పై విమర్శల దాడి చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. రాష్ట్రంలో మహిళల భద్రతకు సీఎందే బాధ్యత అని యోగి ఆదిత్యనాథ్​ను ఉద్దేశించి ట్వీట్​ చేశారు.

హత్రాస్​, షాజహన్​పుర్​, గోరఖ్​పుర్​లో జరిగిన వరుస అత్యాచార ఘటనలు రాష్ట్రాన్ని కదిలించాయన్నారు ప్రియాంక. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయన్న ఆమె.. మహిళలకు రక్షణ కరవైందని ఆరోపించారు. హత్రాస్​ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. కట్టుకథేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.