ETV Bharat / bharat

వరదలో పురిటి నొప్పులు- పడవలో కాన్పు - undefined

బిహార్​లో సహాయక దళాల పడవలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఇంటి నిండా వరద నీరు చేరి పురిటి నొప్పులతో తల్లడిల్లిన గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయి. పడవలోనే ప్రసవించిన ఆ తల్లి, బిడ్డలు ప్రస్తుతం ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు.

Woman delivers baby on NDRF boat in flood-hit Bihar
వరదలో పురిటి నొప్పులు.. పడవలో కాన్పు!
author img

By

Published : Jul 26, 2020, 6:56 PM IST

బిహార్​లో వరద బీభత్సం సృష్టిస్తున్న వేళ.. సహాయక బృందాల పడవలో మరో బిడ్డ పురుడు పోసుకుంది.

భారీ వర్షాలకు బిహార్ లోని బుర్హీ గంధక్ నదీ తీర గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో 21 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అదే సమయంలో తూర్పు చంపారన్ జిల్లాలోని గోబరీ గ్రామానికి చెందిన ఓ నిండు చూలాలి ఇల్లు నీట మునిగింది. ఆమెకు పురిటి నొప్పులు మొదయల్యాయి. సమాచారమందుకున్న సహాయక బృందాలు ఆమెను పడవలో ఎక్కించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాయి.

Woman delivers baby on NDRF boat in flood-hit Bihar
వరదలో పురిటి నొప్పులు.. పడవలో కాన్పు!

నొప్పులు తీవ్రమై తల్లడిల్లిన ఆ తల్లి ఆశా కార్యకర్త సాయంతో.. మధ్యాహ్నం 1:40 గంటలకు పడవలోనే పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెను అంబులెన్స్​లో భంజాయా గ్రామంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు సహాయక సిబ్బంది. ప్రస్తుతం తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు.

"2013 నుంచి ఎన్​డీఆర్​ఎఫ్​ పడవలో 10 శిశు జననాలు నమోదయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రసవం చేయాల్సి వస్తే.. ఎలా స్పందిచాలో సిబ్బందికి శిక్షణ సమయంలోనే నేర్పిస్తాం. కాబట్టి తల్లి బిడ్డలు దాదాపు సురక్షితంగా ఉంటారు."

-ఎన్​డీఆర్​ఎఫ్​ అధికార ప్రతినిధి

ఇదీ చదవండి: భార్యకు బెయిల్ వస్తే.. భర్త విడుదలయ్యాడు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.