భారత్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర వైద్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 45,230 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ ధాటికి మరో 496 మంది మరణించారు.

- రికవరీ రేటు: 91.68 శాతం
- మరణాల రేటు: 1.49 శాతం
- యాక్టివ్ కేసులు: 6.83 శాతం
ఆదివారం ఒక్కరోజు 8,55,800 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 11.07 కోట్లకు చేరినట్లు స్పష్టం చేసింది.