దేశంలో కొవిడ్-19 కేసులు నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 36వేల 604 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 94 లక్షల 99 వేల 414కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 501 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1లక్షా 38వేల 122కి పెరిగింది. దేశవ్యాప్తంగా 43,062 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 89,32,647కు ఎగబాకింది.
దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 10,96,651 నమూనాలను పరీక్షించారు. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 14కోట్ల 24లక్షలు దాటిందని భారత ఔషధ నియంత్రణ పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.