ఉత్తర్ప్రదేశ్ బలరాంపుర్ సామూహిక అత్యాచార కేసులో పోలీసుల విచారణపై బాధితురాలి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసుల నుంచి సరైన మద్దతు లేదని తెలిపారు.
ఇదీ చదవండి- యూపీలో ఘోరం.. మరో రెండు 'నిర్భయ' ఘటనలు
తమ బిడ్డకు సత్వరమే న్యాయం జరగకపోతే ఆత్మబలిదానం చేసుకుంటామని బాధితురాలి తల్లి సహా కుటుంబ సభ్యులు హెచ్చరించారు. నిందితుడి ఇంటి ముందే నిప్పంటించుకుంటామని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదని, డబ్బులు తీసుకొని కేసును మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ దేవ్ రంజన్ వర్మ స్పష్టం చేశారు. విచారణ నిమిత్తం పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశామని, మరికొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి- యూపీలో మైనర్ అపహరణ, సామూహిక అత్యాచారం