ETV Bharat / bharat

ప్రశాంత్​ భూషణ్​కు సుప్రీం రెండు రోజులు గడువు - ప్రశాంత్​ భూషణ్​

తన ట్వీట్​పై సుప్రీంకోర్టుకు క్షమాపణలు చేపలేనన్న ప్రకటనను ప్రశాంత భూషణ్​ పునఃపరిశీలించుకునేందుకు గడువిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా భావించి సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తోంది. ఇప్పటికే ఈ నెల 14న ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు సుప్రీం తీర్పునిచ్చింది. ప్రశాంత్​ భూషణ్​కు విధించే శిక్షపై తీర్పును వాయిదా వేసింది.

Contempt case: SC rejects submission of Bhushan for hearing on sentence by another bench
ప్రశాంత్​ భూషణ్​కు సుప్రీం రెండు వారాల గడువు
author img

By

Published : Aug 20, 2020, 3:01 PM IST

Updated : Aug 20, 2020, 3:28 PM IST

తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పనన్న సీనియర్​ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ వాదనపై పునరాలోచించుకునేందుకు సుప్రీంకోర్టు రెండు రోజులు గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో తన న్యాయవాదులను సంప్రదించి అత్యున్నత న్యాయస్థానం సూచనపై చర్చిస్తానని భూషణ్​ వెల్లడించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా భావించి సర్వోన్నత న్యాయస్థానం కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశాంత్‌ భూషణ్‌ను ఈ నెల 14న దోషిగా తేల్చింది.

తాజా విచారణలో భాగంగా.. ప్రశాంత్​ భూషణ్​కు ఎలాంటి శిక్ష విధించవద్దని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రశాంత్​ భూషణ్​ తన వైఖరిని మార్చుకోకపోతే శిక్ష విధించక తప్పదని స్పష్టం చేసింది. అయితే ఇచ్చిన గడువులోపు ఆయనకు ఎలాంటి శిక్ష విధించబోమని పేర్కొంది.

మరోవైపు.. శిక్ష ఖరారు అంశాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేయాలని దవే కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. బదిలీ ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. 'దోషిగా తీర్పును వెలువరిచిన ధర్మాసనం పనిచేస్తున్నప్పటికీ.. వేరే ధర్మాసనం శిక్ష ఖరారు చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా?' అంటూ ప్రశ్నించింది.

తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి:- కరోనా సంక్షోభంలోనూ 15వేల కేసులను విచారించిన సుప్రీం

Last Updated : Aug 20, 2020, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.