ETV Bharat / bharat

జాతీయ వైద్యుల దినోత్సవం.. ఈ ఏడాది థీమ్​ ఇదే

కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. వేలాదిగా కేసులు వస్తున్నా.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి సమాజ సేవ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా పనిచేసే వారి సేవలను గుర్తిస్తూ, త్యాగాలను నెమరు వేసుకునేందుకు 1991లోనే ఓ రోజును కేటాయించింది భారత ప్రభుత్వం. అదే నేడు(జులై 1న) జరుపుకొనే జాతీయ వైద్యుల దినోత్సవం. అసలు ఈ రోజు ఎలా వచ్చింది? దాని విశేషాలు తెలుసుకుందాం..

National Doctor's Day 2020
జాతీయ వైద్యుల దినోత్సవం: వైద్యో రక్షిత రక్షితః
author img

By

Published : Jul 1, 2020, 11:52 AM IST

కరోనా.. ఇది మానవాళి మనుగడకే సవాలు విసిరిన మహమ్మారి. కంటికి కనిపించని ఈ ప్రమాదకర వైరస్‌తో వైద్యులు ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారు. విపత్కర పరిస్థితిలోనూ అలుపెరగని పోరు సాగిస్తున్నారు. రోగుల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా సేవలు అందిస్తున్నారు. అందుకే.. 'అమ్మ జన్మనిస్తే... వైద్యుడు పునర్జన్మను ప్రసాదిస్తాడు' అని అంటారు. ప్రస్తుతం కొవిడ్‌-19తో కొట్టుమిట్టాడే బాధితుల ప్రాణాలను కాపాడుతూ ప్రత్యక్ష దైవాలుగా మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి వైద్యుల సేవలను గుర్తిస్తూ ఎప్పటినుంచో జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుతోంది ప్రభుత్వం. డాక్టర్స్​డే ను పురస్కరించుకొని.. సామాజిక మాధ్యమాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ రోజునే ఎందుకంటే..?

భారతదేశంలో యావత్తు వైద్యులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన డాక్టర్‌ బీసీ రాయ్(బిదాన్​చంద్ర రాయ్​)‌ గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది. ఈయన జయంతి, వర్ధంతి కూడా జులై ఒకటో తేదీనే. ఏటా ఈ రోజును డాక్టర్ల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఈయన బంగాల్​కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 'డాక్టర్స్​ డే'ను తొలిసారి 1991లో నిర్వహించింది భారత ప్రభుత్వం.

ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తారు. మార్చి 30న అమెరికాలో, డిసెంబర్​ 3న క్యూబాలో, ఆగస్టు 23న ఇరాన్​లో జరుపుతారు.

కరోనాపై పోరు..

ప్రతి ఏడాది వైద్యుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది భారతీయ వైద్య​ సంఘం​(ఐఎంఏ). ఈ ఏడాది 'కొవిడ్​ మరణాల్ని తగ్గించాలి' అనే థీమ్​తో ఈ రోజును నిర్వహిస్తున్నారు. కరోనా అనుమానితులు, వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నవారు, తొలి దశలో కొవిడ్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల ద్వారా అవహగాన కల్పిస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా వెబినార్లు, వర్చువల్​ మీటింగ్​ల ద్వారా వైద్యులు కాన్ఫరెన్స్​లు నిర్వహిస్తారు. వైద్య విభాగంలో సేవలు చేసిన వారిని పలు సంస్థలు ప్రశంసించి సత్కరిస్తాయి.

బంగాల్​ ప్రభుత్వం...

వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జులై 1న రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించారు బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నీరాజనాలు అందిస్తూ.. దేశవ్యాప్తంగా బంద్‌ ప్రకటించారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా జులై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో 'టెలీ మెడిసిన్‌' సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజున దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు మమతా.

వైద్య సిబ్బందిపై కొంతమంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. వారి సేవలను మెచ్చుకొంటూ పోస్టులు పెడుతున్నారు. వాటిలో కొన్ని ఇవే..

  • This is perhaps the most difficult time
    we are ever going to face in our lives. It is even more difficult for the doctors who are working tirelessly &providing proper treatment.Their
    contributions and hard work deserve our gratitude
    each and every day! #doctorsday2020#1stJuly pic.twitter.com/OG51HdVd8r

    — Syed Ehtesham (@ehtesham_811) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #1stJuly “This world has become a better and healthier place to live in with doctors bringing joy of health and goodness to our lives. Happy Doctor’s Day.” pic.twitter.com/hckoZg33G9

    — Ash Tweets (@AshKumrawat) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: పీపీఈ కిట్లే వైద్య సిబ్బందికి శ్రీరామరక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.