నియంతలకు 'ఎం' అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఎందుకున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పలువురి నియంతల పేర్లను తన ట్వీట్లో ప్రస్తావించారు. దీనికి ఆయన వివరణ ఇవ్వనప్పటికీ.. ప్రధాని మోదీ లక్ష్యంగానే ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు స్పష్టమవుతోంది.
-
Why do so many dictators have names that begin with M ?
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Marcos
Mussolini
Milošević
Mubarak
Mobutu
Musharraf
Micombero
">Why do so many dictators have names that begin with M ?
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021
Marcos
Mussolini
Milošević
Mubarak
Mobutu
Musharraf
MicomberoWhy do so many dictators have names that begin with M ?
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021
Marcos
Mussolini
Milošević
Mubarak
Mobutu
Musharraf
Micombero
"చాలా మంది నియంతలకు 'ఎం' అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఎందుకు ఉన్నాయి? మార్కోస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఇటీవల మోదీ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్నారు రాహుల్. రైతు నిరసనలు, వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలపై తరచుగా స్పందిస్తున్నారు. ఓ వైపు చైనా సరిహద్దులో నిర్మాణాలను ముమ్మరం చేస్తుంటే.. ఆ దేశం పేరును ప్రస్తావించడానికే మోదీ భయపడుతున్నారని మంగళవారం ఎద్దేవా చేశారు. ఈ విపత్తను నివారించడానికి దృఢమైన చర్యలు అవసరమని, దురదృష్టవశాత్తు మోదీకి అంత ధైర్యం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చ