ETV Bharat / bharat

మహిళా సాధికారత ఏది?

2005తో పోలిస్తే 2018 నాటికి పనిచేసే మహిళల శాతం తగ్గినట్లు డెలాయిట్​ సర్వేలో తేలింది. జీవిత బీమాలోనూ మహిళలకు అవగాహన తక్కువేనని మరో సర్వే స్పష్టం చేసింది.

author img

By

Published : Mar 8, 2019, 5:28 PM IST

మహిళ

నేడు మహిళా దినోత్సవం. ఈ రోజు వినిపించే పదం ఆకాశంలో సగం, అన్నింట్లో సగం. కానీ నిజంగానే మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నాయా? పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారా..? మగవారితో సమానంగా సంపాదిస్తున్నారా..? తదితర అంశాలపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది డెలాయిట్​ సంస్థ.

తగ్గిన మహిళా ఉద్యోగులు:

2005లో 36.7 శాతంగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య, 2018 నాటికి 26 శాతానికి తగ్గిపోయిందని డెలాయిట్​ సంస్థ నివేకదికలో తేలింది. ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశాలు లేకపోవటం, కట్టుబాట్లు వంటి వాటి వల్ల ఈ శాతం దిగజారినట్లు నివేదిక స్పష్టం చేసింది.

"నాల్గవ పారిశ్రామిక విప్లవం బాలికా, మహిళా సాధికారత" పేరుతో డెలాయిట్​ సంస్థ నివేదిక రూపొందించింది. పనిచేసే వారిలో 95 శాతం మంది మహిళలు అంటే సుమారు 19.5కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది. వీరికి జీతాలు సక్రమంగా అందటం లేదని నివేదిక పేర్కొంది.

పరిస్థితి మెరుగుపడాలంటే విద్యావ్యవస్థను పటిష్ట పరచాలని నివేదిక సూచించింది. డిజిటల్​ విద్య బాలికలకు అందేలా చేయాలని తెలిపింది.

మహిళలు వెనుకబాటుకు కారణాలివే:

⦁ వివిధ కారణాల వల్ల ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు లేకపోవటం.

⦁ నాణ్యమైన బోధన కొరత.

⦁ డిజిటల్​ సాంకేతికతపై అవగాహనా లోపం.

⦁ సామాజిక,కుటుంబ కట్టుబాట్లు.

వీటి వల్ల వారిలో నైపుణ్య కొరత తీవ్రంగా ఉందని డెలాయిట్​ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య, సాంకేతికత ద్వారా వారిలో నైపుణ్యాన్ని పెంచితే సంఘటిత రంగంలో మహిళా ఉద్యోగినులు పెరిగే అవకాశముందని డెలాయిట్​ నివేదిక తెలిపింది.

జీవిత బీమాలోనూ తక్కువే:

ఉద్యోగం చేసే మహిళల జీవిత బీమాపై మాక్స్​-లైఫ్​ ఇన్స్యూరెన్స్​ సంస్థ సర్వే నిర్వహించింది. ఉద్యోగం చేసే మహిళలలో 70 శాతం మందికి జీవిత బీమా లేనట్లు సర్వేలో తేలింది. మెట్రో నగరాల్లో 19 శాతం మంది మహిళలు స్వల్ప కాల బీమా కలిగి ఉంటే, 22 శాతం పూర్తి స్థాయి పథకాలు కలిగి ఉన్నారని సర్వే సష్టం చేసింది.

మహిళలకే బాధ్యత ఎక్కువ!

పురుషులు తమ ఆదాయంలో 38 శాతాన్ని నిత్యావసర ఖర్చుల కోసం ఉపయోగిస్తే, మహిళలు మాత్రం 42 శాతాన్ని అందుకు వినియోగిస్తున్నారని సర్వే పేర్కొంది.

పొదుపు వైపు కంటే పిల్లల చదువుకే మహిళలు తమ ఆదాయాన్ని ఖర్చు చేస్తారని సర్వే తెలిపింది.

జీవిత బీమా పట్ల మహిళలకు అవగాహన తక్కువని, అందుకే పథకాల పట్ల ఆసక్తి చూపరని సర్వేలో తేలింది

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.