ETV Bharat / bharat

అసలేంటీ శార‌దా కుంభ‌కోణం? - narada

శార‌దా చిట్‌ఫండ్స్ మొద‌ట అధిక లాభాల‌ను తెచ్చిపెట్టిన ప‌థ‌కం... అయితే కొంత కాలానికి కొత్త మ‌దుపరులు లేక కుంభ‌కోణంగా మారిపోయింది.

శారదా కుంభకోణం
author img

By

Published : Feb 4, 2019, 10:05 PM IST

శార‌దా రోజ్ వాలే, పోన్జి చిట్ ఫండ్ కుంభ‌కోణం గురించి చాలా ఏళ్లుగా వింటున్నాం. ఈ కుంభ‌కోణంలో మదుపరులు మొత్తం 20వేల‌ కోట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయి ఉంటార‌ని అధికారిక అంచనా. కొన్ని అన‌ధికారిక అంచనాల ప్ర‌కారం ఈ కుంభ‌కోణం రూ.40 వేల కోట్లు పై మాటే. అస‌లు ఏంటీ శార‌దా కుంభ‌కోణం?

ఎలా మొద‌లైంది?

పిర‌మిడ్ ప‌థ‌కం లాంటి డ‌బ్బు డిపాజిట్ పథకం, బ‌హుళస్థాయి(మల్టీ లెవల్) మార్కెటింగ్‌ లాంటిదే ఈ పోన్జీ కుంభ‌కోణం కూడా. మొద‌టి తరంలో వీటిలో మదుపు చేసిన వారికి నిర్వాహ‌కులు పెద్ద మొత్తాల్లో మొద‌టి నెల వ‌డ్డీలు చెల్లించారు. కంపెనీలు వీటిని లాభాల‌ుగా అభివర్ణించాయి. మొదట్లో కంపెనీలు మదుపు చేసిన మొత్తంలో 30 నుంచి 40శాతం లాభాల‌ను తిరిగిచ్చేవి. ఇందులో మదుపు చేయ‌డం ద్వారా బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ల కంటే అధిక వ‌డ్డీ రేట్ల‌ను పొందేవారు.

బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాల‌కు 7 నుంచి 8.5 శాతం వ‌డ్డి రేట్లు పొందే మదుపరులకు శార‌దా చిట్ ఫండ్ లో మ‌దుపు చేయ‌డం ద్వారా 12 శాతం వ‌ర‌కు వ‌డ్డీ లభించేది.

ఈ తరహా పథకాల్లో కొత్త మదుపరులను చేర్పించటానికి కంపెనీలు చాలా కష్టపడతాయి. కొత్త మదుపరుల నుంచి తీసుకున్న మొత్తాల నుంచి కొత్త ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాలు పంచేవారు. కొత్త మదుపరులు చేరడం ఆగిపోయిందంటే ముందటి మదుపరులకు చెల్లింపులు కూడా ఆగిపోయి ప‌థ‌కం కాస్తా కుంభ‌కోణంగా మారుతుంది.

బంగాల్​ బ‌డానేత‌ల‌కు.. శారదా కీలక సూత్రధారులు సుదీప్తా సేన్, గౌతమ్​ కుందులకు సంబంధాలున్నాయని అభియోగాలున్నాయి.

undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.