ETV Bharat / bharat

కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? - కరోనా వైరస్​

కరోనా వైరస్​ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని అందరికీ తెలుసు. ఈ క్రమంలో కొవిడ్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కాంటాక్ట్ ​ ట్రేసింగ్ కీలక భూమిక పోషిస్తుంది​. అసలు ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఏమిటి? కరోనా విషయంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

What is contact tracing,
కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఏమిటి
author img

By

Published : Oct 4, 2020, 5:00 AM IST

కరోనా వైరస్​ ఒకరి నుంచి మరొకరికి సోకుతూ.. యావత్​ ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే విషయంలో కాంటాక్ట్​ ట్రేసింగ్​ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. అసలు ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఏంటి? అది ఏవిధంగా పని చేస్తుంది అనేది తెలుసుకుందాం.

కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ భౌతిక దూరం పాటిస్తున్నారు. కారణం వైరస్​ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా ఉండడం కోసం. ఇదే విధంగా ఒక వ్యక్తికి పాజిటివ్​గా నిర్ధరణ అయిన తరువాత అతని కుటుంబ సభ్యులను, సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్​కు తరలిస్తారు. ఇలా చేయడాన్నే కాంటాక్ట్ ట్రేసింగ్​ అంటారు. ఈ విధంగా చేయడం వల్ల వైరస్​ను కట్టడి చేయొచ్చు.

కొవిడ్​ బాధితుల్ని కలిసిన వారిని అప్రమత్తం చేయడం కాంటాక్ట్​ ట్రేసింగ్​ లక్ష్యం. తద్వారా ఇతరులకు వ్యాపించకుండా నిరోధించవచ్చు. కరోనా మహమ్మారిని కట్టడి చేయటం, ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా తిరిగి ప్రారంభించేందుకు కాంటాక్ట్​ ట్రేసింగ్​ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ ఇది అంత సులభమైన విషయం కాదని అభిప్రాయపడుతున్నారు.

ఒక్కోచోట ఒక్కోలా..

కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుగుతోంది. దీనిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే... పాజిటివ్​గా నిర్ధరణ అయిన వ్యక్తి వివిధ ప్రదేశాల్లో తిరిగి ఉండొచ్చు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చుట్టూ ఎవరున్నారో, అతను ఎవరెవర్ని కలిశాడో ఒక అంచనాకు రావడం చాలా కష్టతరం. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి సంచరించిన ప్రదేశాలను తిరిగి ప్రారంభించడం సాహసంగా పరిగణించవచ్చు.

అమెరికాలో అయితే అక్కడి స్థానిక ఆరోగ్య విభాగాలు వైరస్​ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి సమాచారం ఇస్తాయి. వీలైతే పిలిచి చెప్పడం కూడా జరుగుతోంది. దీనికి స్పందించే వారు ఉన్నట్టే.. నిర్లక్ష్యం చేసేవారూ లేకపోలేదు.

ఇదీ చూడండి: వైరల్​: వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాల ఓదార్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.