పశ్చిమ్ బంగా రాష్ట్రంలో కొవిడ్-19 బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ జూన్ 30తో పూర్తికానుంది.
బంగాల్లో లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న ఆడిటోరియంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు దీదీ. అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవ్వడం వల్ల చివరికి కొన్నింటికి సడలింపులిస్తూ.. మరో నెల రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించారు.
ఇదీ చూడండి: ఇక ఈ- పాస్‌పోర్టులు.. పటిష్ఠ భద్రత కోసమే!