ETV Bharat / bharat

ఒక్కరి కోసం అందరు- అందరి కోసం అందరూ!

ప్రపంచ యుద్ధంలాంటి మారణహోమాన్ని తలపిస్తోన్న కరోనా మహమ్మారిపై విశ్వవ్యాప్త మానవాళి పోరాటం కొనసాగిస్తోంది. ఇప్పటికే 190 దేశాలపై పడగ విప్పిన కొవిడ్​-19ను అరికట్టేందుకు భారత్ సహా..ప్రపంచ దేశాలు మహాయజ్ఞమే చేస్తున్నాయి! ఇందులో ప్రధానంగా.. రోగ లక్షణాలున్న వారు స్వయంగా క్వారంటైన్‌కు సిద్ధపడటం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఎవరు ఎక్కడెక్కడ తిరిగారన్నది జీపీఎస్‌ నిక్షిప్త ‘యాప్‌’ ద్వారా కనిపెడుతూ.. వైరస్‌ బాధితులు వెళ్లిన ప్రాంతాల్ని శుద్ధిచేయాలి. సాంకేతిక పరిజ్ఞానం, మీడియా సహకారం, వైద్యుల త్యాగనిరతి, ప్రజల్లో అవాహన కల్పిస్తూ.. 'ఒక్కరి కోసం అందరు- అందరి కోసం ఒక్కరు’గా మహమ్మారిపై గెలుద్దాం!

We will All Fight Against Coronavirus Worse
ఒక్కరి కోసం అందరు- అందరి కోసం అందరూ!
author img

By

Published : Mar 23, 2020, 8:58 AM IST

Updated : Mar 23, 2020, 9:23 AM IST

ఇది మరో ప్రపంచ యుద్ధం. సరిహద్దుల్లేని యుద్ధ క్షేత్రంలో కంటికి కనిపించని ప్రాణాంతక వైరస్‌పై అకుంఠిత దీక్షతో మానవాళి సాగిస్తున్న మహాపోరాటం! వ్యక్తిగా ప్రతి పౌరుణ్నీ పూర్తి అవగాహన గల నిబద్ధ సైనికుడిలా మార్చి, వ్యష్టిగా వ్యవస్థగా కరోనాను నిలువరించేందుకు, నియంత్రించేందుకు ఇండియా సహా అంతర్జాతీయ సమాజం చేస్తున్నది- వందేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని మహాయజ్ఞం! ప్రపంచ ఆరోగ్య సంస్థ పది రోజుల క్రితం కొవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించేనాటికి అది 114 దేశాల్లో లక్షా 18 వేలమందికి సోకి 4,291 మందిని కబళించింది. అదే నేడు 180 దేశాలకు, మూడు లక్షలకు పైగా కేసుల రూపేణా విస్తరించి 13,700 మందిని బలిగొంది! అంతర్జాతీయీకరణ దరిమిలా యావత్‌ ప్రపంచమే కుగ్రామంగా మారిపోయి విమానయానం ఊహాతీతంగా విస్తరించడంతో పర్యాటకుల రాకపోకలు అత్యధికంగా నమోదైన అయిదు దేశాల్లోనూ కరాళ నృత్యం చేస్తున్న కరోనా- ఇండియా పైనా కోరచాస్తోంది.

భారత్​లో రెండోదశలోనే..

వుహాన్‌ నగరంలో తొలి కేసు నమోదైన కొత్తల్లో కరోనా తీవ్రతను సరిగ్గా గుర్తించలేక భారీ మూల్యమే చెల్లించిన చైనా, వైద్యారోగ్య రంగ శ్రేణుల్ని మోహరించి మహా సంగ్రామమే చేసి కరోనాను కట్టడి చెయ్యగలిగింది. బీజింగ్‌ అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చిన దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలు విస్తృత వ్యాధి నిర్ధారణ పరీక్షలతో కరోనాపై పైచేయి సాధిస్తుండగా, దూరదృష్టి కొరవడిన ఇటలీ ఉప్పెనలా విరుచుకుపడ్డ వైపరీత్యానికి కిందుమీదులవుతోంది. అమెరికా బ్రిటన్లూ తీవ్రాందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయన్న ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ- ఇండియాలో కరోనా విస్తృతికి రెండోదశలోనే పగ్గాలేసే బహుళ కార్యాచరణకు రంగం సిద్ధమైంది. అఖిల భారత జనావళి జయప్రదం చేసిన జనతా కర్ఫ్యూను వెన్నంటి, దేశవ్యాప్తంగా 11 వేల ప్యాసింజర్‌ రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సులూ ఈ నెలాఖరు దాకా రద్దు అయ్యాయి. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలు సరిహద్దుల్ని మూసేస్తున్నాయి. కరోనా అన్నది ప్రస్తుతానికి ఏ మందూ మాకూ లేని మహమ్మారి. మనిషి నుంచి జనసమూహాలకు ఊహాతీత వేగంతో సంక్రమించే వ్యాధి లక్షణాల పట్ల సమగ్ర అవగాహనతో ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య రంగ నిపుణులు, ప్రజలు, మీడియా ఉమ్మడి పోరాటానికి నడుం కట్టాలి!

శతాబ్దపు మహమ్మారిలా..

వందేళ్ల క్రితం స్పానిష్‌ ఫ్లూ అప్పటి 150 కోట్ల ప్రపంచ జనాభాలో నాలుగోవంతుకు సోకి మోగించిన మరణ మృదంగం ఇప్పటికీ చరిత్ర పుటల్లో ప్రతిధ్వనిస్తోంది. దరిమిలా కొన్ని దశాబ్దాలకు‘యాంటీ బయాటిక్స్‌’ కనుగొనడంతో ‘మాయరోగాల’ ఉరవడికి అడ్డుకట్ట పడినా- 2003నాటి సార్స్‌, 2013నాటి మిడిల్‌ఈస్ట్‌ ఫ్లూ వంటివి కొంత భీతిల్లజేశాయి. వాటికి భిన్నంగా ‘శతాబ్దపు మహమ్మారి’లా కరోనా దేశదేశాల సామాజిక ఆర్థిక ఆరోగ్యరంగాల్ని కుదిపేస్తోంది. ప్రపంచానికే సరఫరాదారుగా మారిన చైనాలో పరిశ్రమలు మూతపడటంతో అత్యవసర వైద్య సరఫరాలందక అమెరికా సైతం కలవరపడుతోంది. ఈ స్థాయి ఉత్పాతం ఓ సవాలుగా నిలిచినప్పుడు ఎలా స్పందించాలో 1941లో ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వమే సోదాహరణగా చాటింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కార్ల తయారీని నిలిపేసిన వాహన పరిశ్రమ ప్రతి గంటకు పదికి పైగా యుద్ధ విమానాల్ని సిద్ధం చేసిన వైనం- ఏకోన్ముఖ పోరాటానికి జాతిని ఆయత్తం చేస్తే విజయం తథ్యమని నిరూపించింది.

వ్యాక్సిన్​ తయారీకి కనీసం ఏడాదిన్నర..

వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఇండియా ఎంతో వెనకబడి ఉందన్న సమాచారం భీతి గొలుపుతున్న వేళ ఐసీఎమ్‌ఆర్‌ కొత్త మార్గదర్శకాలు వెలువరించడం, ప్రైవేటు రంగంలోనూ పరీక్షలకు అనుమతించడం సరైన నిర్ణయాలు. అంటువ్యాధిగా కరోనా జడలు విరబోసుకోకముందే సమగ్ర పౌరచేతనతో ముందస్తు నియంత్రణకు పూనిక వహించడం- ఇండియా లాంటి దేశానికి ఎంతో అవసరం. పది రోజుల్లో వెయ్యిపడకల ఆసుపత్రి నిర్మించిన చైనాలో కరోనా రోగులకు సేవలందించడంలో క్షణం తీరిక లేని డాక్టర్లు- డైపర్లు వేసుకొని విధులు నిర్వర్తించిన తీరు నిరుపమానం. రోగుల్లో వైరస్‌ కనిపెట్టే పరీక్షా కేంద్రాల సిబ్బంది మొదలు, వైద్యసేవలందించే డాక్టర్లు, నర్సుల దాకా కాలంతో పోటీపడుతూ విధులు నిర్వర్తించేవారంతా ప్రత్యక్ష దైవాలేననడం నిర్ద్వంద్వం. ‘కొవిడ్‌’ వ్యాక్సిన్‌ తయారీకి కనీసంగా మరో ఏడాదిన్నర సమయమన్నా పడుతుందని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. ఇండియాలో కొవిడ్‌ ప్రమాదకర మూడో దశకు చేరకుండా కట్టడి చెయ్యడానికి మరో రెండు వారాల సమయం ఉన్నందున యావద్దేశం ఏకోన్ముఖ లక్ష్యంతో కదలాలి!

హైదరాబాద్​ మహిళల ఆదర్శం..

భారతావనికి ఇది అక్షరాలా ఆరోగ్య ఆత్యయిక స్థితి. యుక్తవయస్కులు సైతం కరోనా బారినుంచి తప్పించుకోలేరన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో- దేశ ప్రజల సామాజిక, ఆర్థిక, ఆరోగ్య భద్రతల రీత్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పటిష్ఠ కార్యాచరణ సత్వరం పట్టాలకెక్కాలి. వైరస్‌ వ్యాప్తి నిరోధమే లక్ష్యంగా ప్రభుత్వాలు నిత్యావసరాలు మినహా సమస్తం మూసివేతకు, పౌరులంతా ఇళ్లకే పరిమితమయ్యేందుకు ఆదేశాలు జారీచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 50 కోట్లమంది శ్రామిక శక్తిలో 85శాతం అసంఘటిత రంగంలో ఉన్నవారే. సకల సంస్థలు, పరిశ్రమలు, స్వయంఉపాధి మార్గాలు మూసుకుపోతే- వారి బతుకు దుర్భరమే. ఉద్యోగుల వేతనాల బిల్లులో 80శాతం భరించేందుకు బ్రిటన్‌ సిద్ధపడుతుంటే, సంక్షుభిత సమయంలో భారీ కంపెనీలు మూతపడకుండా వాటి జాతీయీకరణకు ఫ్రాన్స్‌ యోచిస్తోంది. ఉద్యోగులతోపాటు, ఉపాధి కల్పించే పరిశ్రమల్నీ ఆదుకోవడంలోనే సంక్షేమరాజ్య భావన దాగుంది. శానిటైజర్లు, మాస్కుల తయారీలో ఉచిత సేవలందిస్తున్న హైదరాబాద్‌ మహిళల ఆదర్శం సంస్తుతిపాత్రమైనది.

అందిరి సహకారంతో..

మహమ్మారి వైరస్‌ నియంత్రణలో పోషకాహారమే కీలకం కానున్న సమయంలో కోళ్ల పరిశ్రమ కుదేలయ్యేలా సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న అసత్య ప్రచార విషధూమాన్నీ చెల్లాచెదురుచెయ్యాలి! రోగ లక్షణాలున్న వారు స్వయంగా క్వారంటైన్‌కు సిద్ధపడటం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఎవరు ఎక్కడెక్కడ తిరిగారన్నది జీపీఎస్‌ నిక్షిప్త ‘యాప్‌’ ద్వారా కనిపెడుతూ, వైరస్‌ బాధితులు వెళ్ళిన ప్రాంతాల్ని శుద్ధిచేస్తూ దక్షిణ కొరియా ఎన్నదగిన విజయాల్ని సాధించింది. సాంకేతిక పరిజ్ఞానం, మీడియా సహకారం సైదోడుగా- వైద్యుల త్యాగనిరతి, ప్రజల్లో సదవగాహనల దన్నుతో అందరం కరోనాపై కదనభేరి మోగిద్దాం. ‘ఒక్కరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు’గా మహమ్మారిపై గెలుద్దాం!

ఇదీ చూడండి : కరోనాపై భారత్​ యుద్ధం- దేశంలో 80 జిల్లాలు లాక్​డౌన్​

Last Updated : Mar 23, 2020, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.