ETV Bharat / bharat

'కృత్రిమ మేధకు గ్లోబల్​ హబ్​గా భారత్​ అవతరించాలి' - కృత్రిమ మేథ గ్లోబాల్​ హబ్​

రైజ్​-2020 వర్చువల్​ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కృత్రిమ మేధలో భారత దేశం ఓ గ్లోబల్​ హబ్​గా మారాలని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించారు. మనిషి నైపుణ్యానికి కృత్రిమ మేధను జోడిస్తే అద్భుతాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు.

We want India to become a global hub for AI: PM Modi
'కృత్రిమ మేధకు గ్లోబల్​ హబ్​గా భారత్​ అవతరించాలి'
author img

By

Published : Oct 5, 2020, 8:54 PM IST

Updated : Oct 5, 2020, 10:42 PM IST

కృత్రిమ మేధ(ఏఐ)లో భారత దేశం ప్రపంచస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం ఇందుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో సాంకేతికతను ఉపయోగించుకుని విద్యను అభ్యసించడానికి పెద్ద పీట వేసినట్టు పేర్కొన్నారు.

రైజ్​​-2020 వర్చువల్​ సదస్సులో పాల్గొన్న మోదీ.. సర్వీసులో పారదర్శకతను సాంకేతికత మెరుగుపరించిందని వ్యాఖ్యానించారు.

"కృత్రిమ మేధపై చర్చలు జరిపేందుకు రైజ్​-2020 ఓ గొప్ప వేదిక. సాంకేతికత, మనిషి అభ్యున్నతికి మధ్య ఎంతో బంధం ఉంది. కార్యాలయాలను సాంకేతికత పూర్తిగా మార్చేసింది. కనెక్టివిటిని పెంచింది. సామాజిక బాధ్యతలను పెంచింది. మనిషికి కృత్రిమ మేధ తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ఏఐలో భారత్​ గ్లోబల్​ హబ్​గా మారాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై ఇప్పటికే అనేకమంది భారతీయులు పనిచేస్తున్నారు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ సందర్భంగా.. ఏప్రిల్​ నెలలో 'రెస్పాన్సిబుల్​ ఏఐ ఫర్​ యూత్​' కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు గుర్తుచేశారు మోదీ. 11వేలకుపైగా విద్యార్థులు.. పాఠశాల దశలోనే ఏఐపై బేసిక్​ కోర్సును పూర్తిచేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు వారు ఏఐ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- పాఠశాలలు తెరిచేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు

Last Updated : Oct 5, 2020, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.