ఎలుక అనగానే అందరికీ ప్రమాదకరం అనిపిస్తుంది. ఇక రైతులకైతే ఆ కష్టాలు చెప్పనక్కర్లేదు. పంట వేసినప్పటినుంచి కోతకొచ్చే వరకు ముప్పుతిప్పలు పెడతాయి. తమిళనాడులో మాత్రం ఇవే ఎలుకలు ఇప్పుడు మంచి గిరాకీ పలుకుతున్నాయి. అక్కడి ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతో ఉత్సుకత చూపుతున్నారు.
వేసవి కారణంగా పొలాలు ఎండిపోయి ఉంటాయి. ఆ సమయంలో అక్కడి రైతులు పొలాల్లో వేటకు బయల్దేరుతారు. ఎలుకలను పట్టి తెచ్చి 100 నుంచి 200 రూపాయలకు అమ్ముతుంటారు. ఒక్కోసారి ఆ ధరలు మరింత పెరగే అవకాశం ఉంది. నీలతనల్లూర్, పట్టీశ్వరమ్, అవుర్, తంజావూర్ జిల్లా కుంభకోణం సమీపంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వ్యవసాయ ఎలుకలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పొలాల్లో నివసించే ఎలుకలను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుందని, అందులో ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధాలు ఉన్నాయని వారు విశ్వసిస్తున్నారు. ఎదేమైనప్పటికి రైతులకు ఇది ప్రత్యమ్నాయ ఆదాయ వనరుగా మంచి లాభాలను తెచ్చిపెడుతోంది.
ఇదీ చూడండి:భారతీయులకు గుండె దడ కాస్త ఎక్కువే...!