ETV Bharat / bharat

'భారత సైన్యానికి నలుగురు విరోధులతో పోరు'

author img

By

Published : Sep 28, 2020, 7:50 PM IST

భారత్​-చైనా సరిహద్దు వివాదాలు ఉద్రిక్తతలకు దారితీసినప్పటి నుంచీ.. పాకిస్థాన్ మౌనంగా ఉంది. పాక్​ వ్యవహారం అనుమానాస్పదంగా ఉన్న దశలో... తన వక్రబుద్ధి మరోసారి చాటుకుంటోంది దాయాది. నవంబర్​ 15న వివాదాస్పద గిల్గిత్​-బాల్టిస్థాన్​ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతాన్ని దేశంలో 5వ ప్రావిన్సుగా చేయాలన్న దూరాలోచనతో ఉంది. ఈ పన్నాగం.. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందంటున్నారు సీనియర్​ పాత్రికేయులు సంజీవ్​ బారువా.

Pak India gambit
'భారత సైన్యం నలుగురు విరోధులతో తలపడాలి'

అటు చైనాతో, ఇటు పాకిస్థాన్‌తో ఏకకాలంలో యుద్ధం అంటూ.. ఇన్నాళ్లుగా వచ్చిన ఊహాగానాలు ఇప్పుడు నిజంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిమగిరుల్లో భారత్-చైనా మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుంటే.. పాకిస్థాన్​ సైతం నవంబర్​ 15 తర్వాత కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధమవుతోంది.

రెండు వైపులా...

చైనా వ్యూహకర్త, భారత వ్యవహారాల నిపుణుడు లీ జోంగ్యీ.. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిడిచే పత్రిక గ్లోబల్​ టైమ్స్​లో భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ చైనా తిరిగిపోరాడకపోతే సరిహద్దులో ఘర్షణలు నిత్యకృత్యంగా మారతాయి. భవిష్యత్తులో ఇవి సర్వసాధారణం అయిపోతాయి. చైనా భారత్​ పట్ల మెతక వైఖరిని మరోసారి సమీక్షించుకోవాలి. భారత్​పై కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసింది.

-లీ జోంగ్యీ

ఈ వ్యాఖ్యలు చైనా-భారత్​తో కయ్యనికి కాలు దువ్వేందుకు సన్నద్ధం అవుతోందన్న విషయం తెలియజేస్తున్నాయి.

మరోవైపు పాక్​ ప్రధాని... భారత్​కు వ్యతిరేకంగా పోరాటంలో చైనా తమకు అండగా ఉంటుందనే విధంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ కశ్మీర్​ అంశం అణుయుద్ధానికి దారి తీస్తుందంటూ భారత్​ను హెచ్చరించారు. జమ్ముకశ్మీర్​ అంశాన్ని అంతర్జాతీయంగా పరిష్కరించే వరకు దక్షిణ ఆసియాలో శాంతి ఉండదని కూడా వ్యాఖ్యానించారు.

పాక్​ వక్రబుద్ధి

భారత్​-చైనా సరిహద్దు వివాదాలు ఏప్రిల్​-మే నుంచే తీవ్ర రూపం దాల్చినా... పాక్ ఈ అంశంపై నోరు మెదపకపోవటం అనేక అనుమానాలుకు తావిచ్చింది. ఇప్పుడా ప్రశ్నలేం రాకుండా తన వక్రబుద్ధి ప్రదర్శిస్తోంది దాయాది దేశం.

అందులో భాగంగానే వివాదాస్పద గిల్గిత్​-బాల్టిస్థాన్​ ప్రాంతంలో నవంబర్ 15న ఎన్నికలు నిర్వహణకు సిద్ధమవుతోంది. అనంతరం దేశంలో 5వ ప్రావిన్సుగా ఈ సెక్టార్​ను కలుపుకోవాలని కుతంత్రాలు పన్నుతోంది.

గిల్గిత్​-బాల్టిస్థాన్​ ప్రాంతాన్ని పాకిస్థాన్​లో పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చితే... సర్వాధికారాలు ఇస్లామాబాద్​ చేతికి వస్తాయి. ఇది ఇన్నాళ్లు దీనిని వివాదాస్పదంగా చెబుతోన్న భారత్​​ వాదనను పూర్తిగా ధిక్కరించటమే. ఈ ప్రాంతాన్ని పాక్​లో భాగంగా చేసి చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది దాయాది.

అంతకుముందు పాక్​ అధికారులు ఈ గిల్గిత్​-బాల్టిస్థాన్​ను ఉత్తర ప్రాంతంగా గుర్తించారు. ఈ సెక్టార్​ వివాదాస్పద ప్రాంతంగా ఉందన్న వాస్తవాన్ని ఒప్పుకునేవారు.

భారత్​ ఇన్నాళ్లూ ఈ సెక్టార్​ను పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో భాగంగా చూస్తోంది. పాక్​ మాత్రం 'ఆజాద్​ కశ్మీర్​' అంటూ వ్యవహరించేది. అయితే, పాకిస్థాన్ ఈ ప్రాంతాన్ని కలిపేసుకుంటే ఇన్నాళ్లూ చెప్పుకున్న ఆజాదీ(స్వేచ్ఛ)ని తానే హరిస్తుందన్న విషయం మర్చిపోతోంది.

​సీపెక్​ కోసమే కుయుక్తులు

గిల్గిత్-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా వెనుక అంతర్జాతీయ కారణాలూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనా కలల ప్రాజెక్టు చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా... సీపెక్​ ఈ ప్రాంతం గుండానే వెళ్తోంది. ఈ వివాదాస్పద సెక్టార్​లో నిర్మాణాలు చేపడుతున్న కారణంగానే.. సీపెక్​ ప్రాజెక్టును భారత్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలా పాకిస్థాన్​లో భాగంగా మార్చేసుకుని ఈ ప్రాంతంలో చైనా పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవాలనే దురాలోచనతో ఉన్నారు ఇస్లామాబాద్​ పెద్దలు.

పాక్.. గిల్గిత్​-బాల్టిస్థాన్​లో​ ఈ దురాగతానికి పాల్పడుతున్న సమయం కూడా వ్యూహాత్మకంగా ఉంది. భారత్​-చైనా మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనలోనే... పాక్​ మరోవైపు నుంచి ఉద్రిక్తతలు సృష్టించి పరిస్థితులను మరింత సంక్లిష్టం చేయాలని చూస్తోంది.

నవంబర్​లో పాకిస్థాన్​ సరిహద్దుగా ఉన్న నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ), చైనా సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వద్ద శీతాకాలం తీవ్రరూపం దాలుస్తుంది. ఈ సమయంలో సైనికులను ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెడుతుంది.

ఒక సైనికుడు... శత్రువుతో పాటు వాతావరణం, మానసిక స్థితితో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక భారత్​ విషయంలో రెండువైపులా యుద్ధం ముంచుకొస్తే.. సైన్యం నలుగురు విరోధులతో తలపడాల్సి ఉంటుంది.

-సంజీవ్​ బారువా, సీనియర్​ పాత్రికేయులు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.