కర్ణాటక ధార్వాడ్ జిల్లా హుబ్లి నగరంలోని కోర్టు సర్కిల్ సమీపంలో గల కర్ణాటక వైన్ మార్ట్ యాజమాన్యం తమదైన శైలిలో ఓటరు అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ నెల 23న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి తమ దుకాణంలో ప్రత్యేక తగ్గింపు ధరలు ప్రకటించింది. 23న ఓటు వేసి వేలికి ఇంకు అంటించుకున్న వారికి... 24న వైన్ మార్ట్లో మద్యంపై 3 శాతం డిస్కౌంట్ కల్పిస్తోంది.
ఆ ఒక్క రోజునే ఆఫర్ అమలులో ఉంటుంది. ఈ మేరకు దుకాణం ముందు బ్యానర్ ఏర్పాటు చేశారు.
పార్టీలు పంచే మద్యానికి ఆశపడి ఓటు వేయకూడదని... మద్యం ప్రియులకు ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం.