పుల్వామా ఉగ్రదాడి... భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఘటన.. జాతీయ రాజకీయాలనూ వేడెక్కిస్తోంది. ఉగ్రదాడికి ప్రతిగా భారత్ నిర్వహించిన మెరుపుదాడిపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అంతే దీటుగా ఎదురుదాడి చేస్తోంది అధికార పక్షం.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ పుల్వామా దాడికి సంబంధించి చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది.
किन्तु पुलवामा दुर्घटना के बाद हमारी वायु सेना द्वारा की गयी “Air Strike" के बाद कुछ विदेशी मीडिया में संदेह पैदा किया जा रहा है जिससे हमारी भारत सरकार की विश्वसनीयता पर भी प्रश्न चिन्ह लग रहा है।
— digvijaya singh (@digvijaya_28) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">किन्तु पुलवामा दुर्घटना के बाद हमारी वायु सेना द्वारा की गयी “Air Strike" के बाद कुछ विदेशी मीडिया में संदेह पैदा किया जा रहा है जिससे हमारी भारत सरकार की विश्वसनीयता पर भी प्रश्न चिन्ह लग रहा है।
— digvijaya singh (@digvijaya_28) March 5, 2019किन्तु पुलवामा दुर्घटना के बाद हमारी वायु सेना द्वारा की गयी “Air Strike" के बाद कुछ विदेशी मीडिया में संदेह पैदा किया जा रहा है जिससे हमारी भारत सरकार की विश्वसनीयता पर भी प्रश्न चिन्ह लग रहा है।
— digvijaya singh (@digvijaya_28) March 5, 2019
"పుల్వామా దుర్ఘటన తర్వాత మన వాయుసేన చేసిన దాడులపై విదేశీ మీడియా సందేహాలు వ్యక్తం చేస్తోంది. అంటే ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతనూ ప్రశ్నించినట్టే"
-దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత
భాజపా ఎదురుదాడి
దిగ్విజయ్ ట్వీట్‌ను భాజపా తప్పుబట్టింది. పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి అయితే... దుర్ఘటన అనడం ఏంటని ప్రశ్నించింది.
"ఉగ్రదాడిని ప్రమాదమని చెబుతున్నారు. నేను దిగ్విజయ్‌సింగ్‌ను మర్యాదగా ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. రాజీవ్‌గాంధీ హత్య ప్రమాదమేనా లేదా ఉగ్రదాడో చెప్పండి. దీనికి ఆయన జవాబు చెబితే అప్పుడు మేమూ నమ్ముతాం. "
-వీకే సింగ్, కేంద్ర మంత్రి
విమర్శలే వారి ఆయుధం
ట్వీట్‌తో చెలరేగిన వివాదంపై దిగ్విజయ్ స్పందించారు. ప్రతివిమర్శలతోనే భాజపా సమాధానం దాటవేస్తోందని మండిపడ్డారు.
पुलवामा आतंकी हमला था इसमें क्या शक है? लेकिन फिर से मोदी जी की Troll Army मूल प्रश्न का उत्तर देने से क़तरा रही है।
— digvijaya singh (@digvijaya_28) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">पुलवामा आतंकी हमला था इसमें क्या शक है? लेकिन फिर से मोदी जी की Troll Army मूल प्रश्न का उत्तर देने से क़तरा रही है।
— digvijaya singh (@digvijaya_28) March 5, 2019पुलवामा आतंकी हमला था इसमें क्या शक है? लेकिन फिर से मोदी जी की Troll Army मूल प्रश्न का उत्तर देने से क़तरा रही है।
— digvijaya singh (@digvijaya_28) March 5, 2019
"పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మళ్లీ మోదీ 'విమర్శల సైన్యం' సమాధానాన్ని దాటవేసేందుకే ప్రయత్నిస్తోంది."
-దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి:"పాక్ పత్రికల్లో మన ప్రతిపక్షం"