జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు శ్రీనగర్ వెళ్లేందుకు సమాయత్తంకాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎవరూ రావొద్దని కోరింది. క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో రాజకీయ పార్టీల నాయకుల పర్యటనలు లోయలో శాంతికి విఘాతం కలిగిస్తాయని జమ్ముకశ్మీర్ సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది.
నేతలు పర్యటిస్తే వేర్వేరు ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ఉల్లఘించినట్లు అవుతుందని పేర్కొంది. లోయలో శాంతి నెలకొనడమే ప్రధమ ప్రాధాన్యమనే విషయాన్ని అర్థం చేసుకుని రాజకీయ నాయకులు తమకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ ప్రతినిధి మనోజ్ ఝాతో కూడిన బృందం నేడు కశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్ధంకాగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన- ఎస్సీలకు న్యాయం