ETV Bharat / bharat

'ఆ రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా ' - union health ministry latest nes

గత ఏడు వారాల నుంచి దేశంలో సరాసరి కొవిడ్​-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ వెల్లడించారు. మరణాల సంఖ్య కూడా తగ్గిందని వివరించారు. కానీ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. దిల్లీలో వెంటిలేటర్ల కొరత ఉందన్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

VIRUS-HEALTH-MINISTRY-LATEST-NEWS-ON-CORONA
ఆ రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా '
author img

By

Published : Nov 3, 2020, 10:21 PM IST

దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. కానీ నాలుగు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం

  • కేసులు గణనీయంగా తగ్గిన రాష్ట్రాలు

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్

  • కేసులు గణనీయంగా పెరిగిన రాష్ట్రాలు

కేరళ, దిల్లీ, పశ్చిమ్​ బంగా, మణిపుర్

అక్టోబరు 3నుంచి నవంబరు 3 వరకు ఈ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగాయని స్పష్టం చేశారు.

  • సెప్టెంబర్​ 16-22 మధ్య రోజూ నమోదైన సరాసరి కేసులు : 90,346
  • అక్టోబరు 28-నవంబరు3 వరకు రోజూ నమోదైన సరాసరి కేసులు : 45,884
  • సెప్టెంబర్​ 16-22 మధ్య రోజూ నమోదైన సరాసరి మరణాల సంఖ్య -1,165
  • అక్టోబరు 28-నవంబరు3 వరకు రోజూ నమోదైన సరాసరి సరాసరి మరణాల సంఖ్య -513

దేశంలో ఇప్పటివరకు 11కోట్లమందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని భూషణ్​ తెలిపారు. రోజూవారీ పాజిటివ్ రేటు క్రమంగా తగ్గుతోందని వెల్లడించారు. దిల్లీలో వెంటిలేటర్ల కొరత లేదని స్పష్టం చేశారు.

దేశంలో చాలామంది ప్రజలకు ఇంకా కొవిడ్​-19ను తేలిగ్గా తీసుకుంటున్నారని నీతి ఆయోగ్​ సభ్యులు వీకే పాల్​ తెలిపారు. లక్షణాలుంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.