ETV Bharat / bharat

పుల్వామా దాడికి వర్చువల్‌ సిమ్​ల వినియోగం..! - వర్చువల్​

పుల్వామా ఉగ్రదాడికి తీవ్రవాదులు వర్చువల్​ సిమ్​లను వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. సిమ్​లకు సర్వీస్​ అందించిన వారి వివరాలు తెలపాలని అమెరికా సాయం కోరింది భారత్​. కంప్యూటర్​ ఆధారంగా పనిచేసే సాంకేతికతను వినియోగించి దాడికి ప్రణాళిక రచించినట్లు తెలిసింది.

పుల్వామా దాడికి వర్చువల్‌ సిమ్​ల వినియోగం
author img

By

Published : Mar 24, 2019, 10:27 PM IST

Updated : Mar 25, 2019, 7:46 AM IST

ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో ఉగ్రవాదులు ఆరితేరారు. పుల్వామా దాడిపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడి కోసం అత్యాధునిక వర్చువల్‌ సిమ్‌లను వినియోగించారని వెల్లడైంది. ఈ సిమ్‌ల సమాచారాన్ని ఛేదించడానికి అమెరికా సాయాన్ని కోరింది భారత్​.

పుల్వామా ఘటన తర్వాత త్రాల్‌తో సహా ఇతర చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రదేశాలను దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. దొరికిన ఆధారాల బట్టి చూస్తే పుల్వామా దాడికి పాల్పడిన ఆదిల్‌ దార్‌ దాడి చేసేంత వరకు సూత్రధారి ముదసిర్‌ ఖాన్‌తో సంభాషించినట్లు అధికారులు చెప్పారు.

వర్చవల్‌ సిమ్‌లో ఎలా ...

వర్చువల్​ సిమ్​ సర్వీస్‌ ప్రొవైడర్లు అమెరికాలో ఉంటారు. కంప్యూటర్‌ ఆధారిత ఫోన్‌ నెంబర్‌ను సృష్టిస్తారు. దీనిని వినియోగించేందుకు ఫోన్​లో సర్వీసు ప్రొవైడర్‌ అప్లికేషన్‌ ఉండాలి. సోషల్‌ మీడియా ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. దీని నెంబర్లు ‘+1’తో ప్రారంభమవుతాయి. ఇలాంటి నెంబర్లను వాడటం కోసం వినియోగించే దే 'మొబైల్‌ స్టేషన్‌ ఇంటర్నెషనల్‌ సబ్‌స్క్రైబర్‌ డైరెక్టరీ' (ఎంఎస్‌ఐఎస్‌డీఎన్‌).

వర్చువల్​ సిమ్​ల వివరాలు, వాటికి సర్వీస్​ అందించిన సంస్థలు, ఇంటర్​నెట్​ ప్రోటోకాల్​ అడ్రస్​లు అందించాలని అమెరికాను కోరింది భారత్​.

ముంబయి దాడుల్లోనూ...

26/11 ముంబయి దాడుల సమయంలోనూ వర్చువల్‌ సిమ్‌లను ఉపయోగించారని అధికారులు గుర్తించారు. సిమ్‌ కోసం తప్పుడు వివరాలను పెట్టి 229 డాలర్లను వెస్ట్రన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా కాల్​ఫోనెక్స్‌కు పంపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బు ఇటలీలోని మదీన ట్రేడింగ్‌ సంస్థ ద్వారా పీవోకేలోని జావెద్‌ ఇక్బాల్‌ ఖాతాకు వెళ్లినట్లు తెలిసింది.

అనంతరం 2009లో ఇద్దరు పాకిస్థానీలను ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. కాల్​​ఫోనెక్స్​ సంస్థ ఇక్బాల్‌ కోసం 300 సార్లు నగదు లావాదేవీలను జరిపినట్లు తేలింది. కానీ ఇక్బాల్​ ఒక్కసారి కూడా ఇటలీలో అడుగు పెట్టిన సందర్భం లేదు.

ఇదీ చూడండీ: ఉగ్రవాదానికి దారులు మూసేస్తోన్న సర్కారు!

Mumbai, Mar 24 (ANI): Akshay Kumar-starrer 'Kesari', which became the top grosser of the year so far owing to its opening day collections, has crossed another benchmark- the Rs. 50 crore mark after just three days of its run at the box office. The period drama has collected Rs. 56.51 crore so far. Indian film critic and trade analyst Taran Adarsh took to his Twitter handle to share the box office collection of the film. The film had a spectacular opening on the occasion of Holi. 'Kesari' earned Rs. 21.06 crore on its first day, making it the biggest opener of the year so far. The war drama has earned rave reviews from critics and the audience alike. The film earned Rs. 16.70 crore on its second day, and minted Rs. 18.75 crore on its third day, paving it's the way into to the 50 crore club. According to Taran, the film featured on 4200 screens across the world, with 3600 in the country and 600 abroad. 'Kesari', also starring Parineeti Chopra, is based on the 1897 Battle of Saragarhi, where an army of 21 Sikhs fought against 10,000 Afghans. Akshay will be seen essaying the role of Havildar Ishar Singh. The film, which is directed by Anurag Singh, hit the theatres on March 21, giving fans a perfect Holi gift. Apart from 'Kesari', Akshay will also be seen in 'Good News' and 'Mission Mangal', while, Parineeti will soon star in 'Sandeep Aur Pinky Faraar' and 'Jabariya Jodi'.
Last Updated : Mar 25, 2019, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.