ETV Bharat / bharat

ట్రంప్​ పర్యటన వేళ హింస- ఏడుగురు మృతి - దిల్లీ సీఏఏ నిరసనలు

దిల్లీలో ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ పర్యటిస్తుంటే.. మరోవైపు పౌర నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా అల్లర్లలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికిపైగా క్షతగాత్రులయ్యారు. పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమీక్షిస్తున్నారు.

VIOLENCE ERUPT IN DELHI AGAINST CAA AMIDST DONALD TRUMP'S VISIT
ట్రంప్​ పర్యటన వేళ హింస- ఏడుగురు మృతి
author img

By

Published : Feb 25, 2020, 11:27 AM IST

Updated : Mar 2, 2020, 12:19 PM IST

ట్రంప్​ పర్యటన వేళ హింస- ఏడుగురు మృతి

అమెరికా అధ్యక్షుడి పర్యటన వేళ దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌర నిరసనల్లో చెలరేగిన హింస మరింత తీవ్రమైంది. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు పోలీసు.

ఈశాన్య దిల్లీలో...

ఈశాన్య దిల్లీలోని మౌజ్​పుర్​లో ఆదివారం అల్లర్లు ప్రారంభమయ్యాయి. సోమవారం జఫ్రాబాద్​, మౌజ్‌పుర్‌, చాంద్‌బాగ్‌, భజన్‌పురాలో హింస చెలరేగింది.

నిరసనకారులు ఓ అగ్నిమాపక శకటానికి నిప్పు పెట్టారు.

మౌజ్​పుర్​-బ్రహమ్​పురి ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం కూడా ఆందోళనకారులు రాళ్లురువ్వారు. బ్రహమ్​పురిలో దిల్లీ పోలీసులు, రాపిడ్​ యాక్షన్​ ఫోర్స్​(ఆర్​ఏఎప్​) సిబ్బంది కవాతు నిర్వహించారు. రెండు ఖాళీ బులెట్​ గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా... ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.

ఈశాన్య దిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఐదు మెట్రో స్టేషన్ల(జఫ్రాబాద్​, మౌజ్​పుర్​-బాబర్​పుర్​, గోకుల్​పుర్​, జోహ్రా ఎన్​క్లేవ్​, శివ్​ విహార్​)ను మూసివేశారు.

సమీక్షలు... సమావేశాలు...

ఈశాన్య దిల్లీలో పరిస్థితిపై సమీక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. పోలీసు, నిఘా ఉన్నతాధికారులతో అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారు. పరిస్థితి చేయిదాటి పోకుండా సంయమనంతో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు దిల్లీ గవర్నర్​, ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​, ఇతర పార్టీ ప్రతినిధులతో షా భేటీ అవుతారని తెలుస్తోంది.

కేజ్రీవాల్​ భేటీ...

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల ఎమ్మెల్యేలు, అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.

Last Updated : Mar 2, 2020, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.