ETV Bharat / bharat

నూడుల్స్​తోనే ఆకలి తీర్చుకుంటున్న దిల్లీ వాసులు! - సీఏఏ వ్యతిరేక నిరసనలు

దిల్లీ వీధుల నిండా విధ్వంసం చెలరేగుతోంది. ఈ హింసాత్మక ఆందోళనలకు ఎన్నో పాఠశాలలూ ధ్వంసమయ్యాయి. ఆందోళన జ్వాలల్లో అమయాకులు బలవుతున్న పరిస్థితి. వీధుల్లోకి వెళ్లి నిత్యావసర సరకులు కొనుగోలు చేయలేక.. ఇంట్లో ఉన్న బ్రెడ్డు, నూడుల్స్‌తోనే సరిపెట్టుకుంటున్న దుస్థితి.

Violence And Riots in new delhi protesters collapsed schools in the city
బడులను బుగ్గిపాలు చేసిన హింసాత్మక ఆందోళనలు
author img

By

Published : Feb 28, 2020, 9:13 AM IST

Updated : Mar 2, 2020, 8:09 PM IST

గడప దాటి కాలు బయటపెట్టలేక బిక్కుబిక్కుమంటున్న జనం.. కాలిపోయిన వాహనాలతో నిండిన వీధులు.. పుస్తకాల బూడిదతో కూడిన బడులు.. ఈశాన్య దిల్లీలో ఇదీ ప్రస్తుత పరిస్థితి! అల్లర్ల తీవ్రతకు అక్కడి జనమంతా అల్లాడిపోతున్నారు. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా.. ఎవరు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తారోనన్న ఆందోళనతో హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా సోమ, మంగళవారాల్లో ఆందోళనకారులు పలు పాఠశాలల్లో విధ్వంసం సృష్టించారు.

"మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఆందోళనకారులు మా పాఠశాల వైపు దూసుకొచ్చారు. కాపలా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఆ గుంపును చూసి బెదిరిపోయాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఆందోళనకారులు లోపలికి ప్రవేశించి డెస్కులు, పుస్తకాలు, రికార్డులన్నింటినీ కాల్చి బూడిద చేశారు. దాదాపు రూ.70 లక్షల ఆస్తి నష్టం చోటుచేసుకుంది. దాడి సమయంలో పిల్లలు పాఠశాలలో లేకపోవడంతో బతికిపోయాం. పిల్లలు అక్కడే ఉండి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలంటేనే భయమేస్తోంది" అని బ్రిజ్‌పురి ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

వీధుల్లోకి వెళ్లి నిత్యావసర సరకులు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోడంతో.. ఇంట్లో ఉన్న బ్రెడ్డు, నూడుల్స్‌తోనే రెండు రోజులుగా ఆకలి తీర్చుకుంటున్నామని బ్రిజ్‌పురి ప్రాంతవాసి ఒకరు తెలిపారు. మూడు రోజులుగా తమ ప్రాంతానికి పాల సరఫరా లేదని వాపోయారు.

నిండు చూలాలును కడుపులో తన్ని..

కరవాల్‌ నగర్‌ ప్రాంతంలో ఆందోళనకారులు అత్యంత కర్కశంగా వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగుచూసింది. నెలలు నిండిన ఓ మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి ఇంట్లో ఉండగా సోమవారం రాత్రి కొంతమంది గుంపుగా ఇంట్లోకి ప్రవేశించారు. నిండు చూలాలును కడుపులో తన్నారు. ఆమె భర్తపై దాడి చేశారు. ఆ కుటుంబమంతా ఎలాగోలా వారి నుంచి తప్పించుకుంది. అనంతరం ఆందోళనకారులు ఆ ఇంటికి నిప్పుపెట్టారు. వారి నుంచి తప్పించుకున్న గర్భిణి ఆస్పత్రిలో చేరగా పండంటి మగబిడ్డ పుట్టాడు.

ఇదీ చదవండి:అల్లర్లు: 38మంది మృతి- భయం గుప్పిట్లోనే ప్రజలు

Last Updated : Mar 2, 2020, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.