ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.
"చంద్రయాన్-2: ఆర్బిటర్.. ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కనిపెట్టింది. అయితే ఇప్పటి వరకు విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణ జరగలేదు. కానీ విక్రమ్‌తో కమ్యునికేట్ కావడానికి వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం."-ఇస్రో ట్వీట్
ఇప్పుడే ఏమీ చెప్పలేం..
ల్యాండర్ విక్రమ్ థర్మల్ ఇమేజ్‌ని ఆర్బిటర్ తీసిందని.. సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. అయితే దీనిని సాధించగలమా? లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.
చివరి నిమిషంలో
సెప్టెంబర్ 7న ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంలో సురక్షితంగా దిగాల్సి ఉంది. అయితే విక్రమ్ చంద్రునికి 2.1 కి.మీ దూరంలో ఉన్నప్పుడు.. ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది. ఆశలు అడియాశలు అనుకున్న వేళ ఆర్బిటర్... ల్యాండర్‌ను గుర్తించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. చంద్రునిపై కాలుమోపిన దేశంగా.. రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్ చేరుతుంది.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఆంక్షలు సడలించండి: ఐరాస హెచ్ఆర్సీ