కర్ణాటక విజయపురలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెంపుడు శునకానికి శ్రీమంతం చేసింది ఓ కుటుంబం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆ శునకాన్ని సొంత బిడ్డలా చూసుకుంటున్నామని చెబుతోంది ఆ కుటుంబం.
సోలాపుర్ రోడ్డులో నివాసముందే ప్రకాశ్ కుంబర్.. ఓ సామాజిక కార్యకర్త. ఆయన సోనియా అనే పొమరేనియన్ జాతి కుక్కను పెంచుకుంటున్నాడు. అది ఇటీవల గర్భం దాల్చగా.. వైభవంగా శ్రీమంతం చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రకాశ్. ఈ కార్యక్రమానికి ఇరుగుపొరుగును కూడా ఆహ్వానించాడు.
సోనియా శ్రీమంతానికి వచ్చిన చుట్టుపక్కన వాళ్లు.. దానికి కుంకుమ రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోనియాకు బంగారు గొలుసు బహూకరించాడు ప్రకాశ్.
ఇదీ చూడండి: నీళ్ల బండిపై తల్లిని తోస్తూ.. 3 కి.మీ. కాలినడక