బాబ్రీ మసీదు కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్కే యాదవ్ ఆదేశించారు.
బాబ్రీ కేసులో మొత్తం 32మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, ఎమ్ఎమ్ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు.
విచారణ సందర్భంగా.. మొత్తం 351మంది సాక్ష్యులను కోర్టు ఎదుట హాజరుపరిచింది సీబీఐ. 600లకుపైగా ఆధారాలను డాక్యుమెంటరీ రూపంలో కోర్టుకు సమర్పించింది. కేసుకు సంబంధించి ఈ నెల 1వ తేదీన వాదనలు ముగిశాయి.