ETV Bharat / bharat

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా వెంకయ్య

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. సంస్థ ఉపాధ్యక్షులుగా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం ఛైర్మన్ పీపీ చౌదరీ, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్​లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

indian council of world affairs
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా వెంకయ్యఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా వెంకయ్య
author img

By

Published : Aug 6, 2020, 5:53 AM IST

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షులుగా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం ఛైర్మన్ పీపీ చౌదరీ, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సభ్య కార్యదర్శిగా ఐఎఫ్​ఎస్ రిటైర్డ్ అధికారి టీసీఏ రాఘవన్ నియమితులయ్యారు.

వీరితో పాటు అయిదుగురు లోక్​సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులకు దౌత్య, అంతర్జాతీయ వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఏడుగురు ప్రముఖులు, ఏడు విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు, ప్రొఫెసర్లకు ఇందులో స్థానం కల్పించారు. అదే విధంగా ఏడుగురు ప్రముఖ పాత్రికేయులు, వివిధ ప్రముఖ సంస్థలకు నేతృత్వం వహించిన వ్యక్తులు, ప్రముఖ వాణిజ్య సంస్థలకు నేతృత్వం వహిస్తున్న అదుగురు సభ్యులు, ముగ్గురు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు, అయిదుగురు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించారు.

తెలుగువారు

ఇందులో తెలుగువారైన ఫిక్కీ మాజీ సెక్రెటరీ జనరల్ సంజయ్ బారు, జేఎన్​యూ ఉపకులపతి జగదీష్ కుమార్, జేఎన్​యూ ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి, ప్రసారభారతి సీఈఓ శశిశేఖర్ వెంపటి ఉన్నారు.

1943లో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ వ్యవహారాలపై అధ్యయనం చేస్తుంది. 2001లో దీన్ని పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థగా ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.