'మిగ్-21' యుద్ధవిమానాన్ని నడపటమనేది ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కుటుంబానికి సంప్రదాయంగా మారింది. అతని తండ్రి విశ్రాంత ఎయిర్ మార్షల్ సింహకుట్టీ వర్ధమాన్ సైతం మిగ్-21ను తొలినాళ్లలో పరీక్షించారు. ఐదేళ్ల క్రితమే పదవీ విరమణ చేశారు సింహకుట్టీ. అభినందన్ తండ్రే కాదు..తాత కూడా భారత వాయుసేనకు చెందినవారే.
వర్ధమాన్ కుటుంబ విశేషాలను ఆంగ్ల వార్తాసంస్థకు సింహకుట్టీ మిత్రుడు, విశ్రాంత వింగ్ కమాండర్ ప్రకాశ్ నావలే తెలియజేశారు. సింహకుట్టీ, ప్రకాశ్ 1969-72 జాతీయ రక్షణ అకాడమీ(ఎన్డీఏ) బ్యాచ్‌కు చెందినవారు. ఆ సమయంలోనే మూడేళ్ల వయసున్న అభినందన్‌ను చూశానని ఆయన వెల్లడించారు.
"హైదరాబాద్ హకీంపేటలో మొదటిసారిగా శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. అమరావతినగర్ సైనిక్ పాఠశాలలో సింహకుట్టీ చదువుకున్నారు. ఆయన భార్య శోభ వైద్యురాలు. సింహకుట్టీ తండ్రి కూడా వాయుసేనలో పనిచేశారు. తండ్రి, తాతయ్యల స్ఫూర్తితో అభినందన్ వాయుసేనలో చేరారు."
- ప్రకాశ్ నావలే, విశ్రాంత వింగ్ కమాండర్
ప్రకాశ్ నావలే
1982లో ప్రకాశ్ నావలేకు 'శౌర్యచక్ర అవార్డు'ను భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్‌ను దాడి నుంచి కాపాడినందుకు ఆయనను ప్రభుత్వం సత్కరించింది.
ఇదీ చూడండి:పాక్ వెనక్కి తగ్గిందిందుకే..