డ్రైనేజీ వ్యవస్థ పేలవంగా ఉండటంపై ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని అంబియమండి ప్రాంతంలో తరచూ నీళ్లు నిలుస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని స్థానిక కౌన్సిలర్‌ను నిలదీశారు.
రోడ్డుపై నిలిచి ఉన్న నీటిలోనే కౌన్సిలర్‌ను కుర్చీకి కట్టేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు బందీగా ఉంచారు. సమస్య పరిష్కారానికి అధికారులు, పోలీసుల నుంచి హామీ లభించిన తర్వాత కౌన్సిలర్‌ను విడిచిపెట్టారు.
ఎన్ని ఫిర్యాదులు చేసినా..
తమ ప్రాంతంలో నీళ్లు నిలుస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పాలకులు, అధికారులు పట్టించుకోలేదని అంబియమండి వాసులు ఆరోపిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి దుస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోవాలనే ఇలాంటి చర్యకు పాల్పడ్డామని తెలిపారు.
ఇదీ చూడండి: 'అక్కడి రైతుల ధర్నాతో వేల కోట్లు నష్టం'