ETV Bharat / bharat

రాహుల్​కు ఝలక్​- చరిత్ర సృష్టించిన స్మృతి - భాజపా

కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే అమేఠీలో ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. దశాబ్దాల తరబడి గాంధీ- నెహ్రూ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న అమేఠీ వాసులు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి షాకిచ్చారు. భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీకి పట్టం కట్టారు. 1967 తర్వాత అమేఠీ నుంచి గెలిచిన 3వ కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు స్మృతి.

అమేఠీలో రాహుల్​కు షాకిచ్చిన స్మృతి ఇరానీ
author img

By

Published : May 23, 2019, 7:39 PM IST

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగిలింది. దశాబ్దాలుగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి పట్టం కడుతూ వచ్చిన అమేఠీ ఓటర్లు.. ఈసారి కమలానికి జై కొట్టారు. మోదీ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న ప్రచారాన్ని విశ్వసించిన అమేఠీ ప్రజానీకం కాషాయానికి పట్టం కట్టారు. భాజపా అభ్యర్థిగా స్మృతి ఇరానీని గెలిపించి.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికే ఊహించని తీర్పు చెప్పారు.

తరుచూ పర్యటనలతో..

రాహుల్‌ అందుబాటులో ఉండరని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన స్మృతి ఇరానీ... గత ఎన్నికల్లో ఓటమిపాలైనా తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానంటూ మద్దతు కూడగట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీపై పోటీ చేసిన ఆమె లక్ష ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అనంతరం కేబినెట్ మంత్రిగా పనిచేస్తూనే అమేఠీలో తరచూ పర్యటిస్తూ అక్కడి ప్రజల మనసులు గెలుచుకున్నారు.

కాంగ్రెస్​పై వ్యతిరేకత...

దశాబ్దాలుగా గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠీలో కాంగ్రెస్​ ప్రభ నానాటికీ దిగజారడం స్మృతి విజయానికి తోడ్పడిందని చెప్పాలి. నియోజకవర్గ అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వాదన వ్యతిరేకతకు కారణమైంది. ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవటం, అధ్యక్షుడి హోదాలో ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తూ నియోజకవర్గాన్ని విస్మరించారనే భావన... అమేఠీ ప్రజల్లో నెలకొనడమే రాహుల్ ఓటమికి దారితీసింది.

1967 నుంచి కాంగ్రెస్​కు కంచుకోట..

గాంధీ-నెహ్రూ కుటుంబానికి 1967 నుంచి అమేఠీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు. 2 సార్లు మాత్రమే కాంగ్రెసేతర పార్టీలు ఇక్కడ విజయం సాధించాయి. అత్యవసర పరిస్థితి అనంతరం జరిగిన 1977ఎన్నికల్లో జనతాపార్టీ అభ్యర్థి రవీంద్రప్రతాప్‌ సింగ్‌ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్‌ గాంధీపై 75 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1998లో బీజేపీ అభ్యర్థి సంజయ్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి సతీశ్‌ శర్మపై 23 వేల ఓట్ల తేడాతో నెగ్గారు. తాజా ఎన్నికల్లో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ విజయఢంకా మోగించారు. 1967 తర్వాత అమేఠీ నుంచి గెలిచిన 3వ కాంగ్రెసేతర అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.

తొలి సారి ఓటమి..

2004లో అమేఠీ నుంచి ఎన్నికల బరిలో నిలిచి రాజకీయ అరంగేట్రం చేసిన రాహుల్ గాంధీ అప్పటి నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. తొలి ఎన్నికల్లో 3 లక్షల 90 వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. 2009 ఎన్నికల్లో 4 లక్షల 64 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. దేశవ్యాప్తంగా మోదీ పవనాలు వీచిన 2014 ఎన్నికల్లో గెలిచినా లక్షా 7 వేల ఓట్ల ఆధిక్యానికి పరిమితమయ్యారు. ఈసారి ఓటమి పాలయ్యారు.

ఇదీ చూడండి: చాయ్​వాలానే కాదు... చౌకీదారూ గెలిచారు

AP Video Delivery Log - 0900 GMT Horizons
Thursday, 23 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0854: HZ Spain Zoo AP Clients Only 4212102
Zoo banned from breeding unless offspring are returned to the wild
AP-APTN-0421: HZ US Endangered Wolves AP Clients Only 4212098
Costly survival plan fails as illegal killing threatens wolves
AP-APTN-1649: HZ Serbia Jet Suit AP Clients Only 4212112
An Iron Man jets into Belgade
AP-APTN-1526: HZ US Sea Dragons AP Clients Only 4212092
Sea dragons captivate at new purpose built aquarium
AP-APTN-1259: HZ UK Plastic No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg;AP Clients Only 4212060
UK to ban plastic straws, stirrers and cotton buds
AP-APTN-0915: HZ Italy Holograms AP Clients Only 4210776
Medical software converts CT and MRI scans into holograms
AP-APTN-0915: HZ Australia Bilby AP Clients Only / No access Australia 4211889
Bringing back the bilby - a century extinct in New South Wales
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.