వలస కూలీల కష్టాలు తీరుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు దేశప్రజలు. ఈ జాబితాలోకి ప్రముఖ రాజకీయ నేతలు కూడా చేరుతున్నారు. తాజాగా.. లాక్డౌన్ కారణంగా ముంబయిలో చిక్కుకున్న తమ రాష్ట్ర కూలీలను చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా స్వరాష్ట్రానికి తరలించేందుకు కృషి చేసిన సోనూసూద్‌కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోనూతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు.
'మానవతా దృక్పథంతో సమాజ సేవ చేసిన సోనూసూద్‌కు కృతజ్ఞతలు. అతనితో పాటు వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కృషిచేసిన అన్ని సామాజిక సంస్థలకు అభినందనలు.'
- త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత తమ రాష్ట్రానికి రావాలని సోనూసూద్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు సీఎం.
సోనూ స్పందన..
ముఖ్యమంత్రి మాటలు తనకు మరింత బలాన్ని అందించాయని తెలిపారు సోనూసూద్. త్వరలోనే బద్రీ-కేదార్నాథ్ దర్శనానికి వస్తానని, ఆ సమయంలో ముఖ్యమంత్రిని కలుస్తానని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: ఇంట్లో దూరిన ఎగిరేపాము.. పట్టుకోలేక ఆపసోపాలు!