ETV Bharat / bharat

బాలుడు​ కిడ్నాప్​ డ్రామా- రూ.50కోట్లు డిమాండ్

యూపీలో 15ఏళ్ల బాలుడు కనిపించడం లేదని భయాందోళనకు గురైంది ఓ కుటుంబం. ఇంతలోనే ఆ బాలుడిని కిడ్నాప్​ చేశామని రూ. 50కోట్లు ఇస్తే వదిలేస్తామని సందేశం అందింది. పోలీసులు రంగంలోకి దిగాక సెల్ఫ్​ కిడ్నాప్​ డ్రామా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.?

Uttar Pradesh: Minor stages own kidnapping and demands Rs 50 crore ransom from kin
సెల్ఫ్​ కిడ్నాప్​ డ్రామాతో ఓ బాలుడు రూ.50కోట్లు డిమాండ్​
author img

By

Published : Nov 4, 2020, 12:06 PM IST

Updated : Nov 4, 2020, 12:31 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో 15ఏళ్ల బాలుడు కిడ్నాప్​కు గురయ్యాడు. కొద్ది సేపటికి ఆ బాలుడి బంధువులకు ఫోన్​ చేసి రూ. 50 కోట్లు డిమాండ్​ చేశాడు కిడ్నాపర్. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ రంగంలోకి దిగటంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఆ బాలుడే కిడ్నాప్​ డ్రామా ఆడినట్లు తేలిసి.. కుటుంబం, పోలీసులు ఖంగుతున్నారు.

అలా ఎందుకు చేశాడంటే?

ఇన్నాళ్లు తండ్రి, పినతల్లితో పాటు ఇద్దరు సోదరీమణులతో కలిసి ఉన్నాడు ఆ బాలుడు. అయితే.. అక్కడి పరిస్థితులు నచ్చక వేరే చోటుకు వెళ్లేందుకే ఇలా ప్లాన్​​ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందుకోసం అతడు డబ్బు పంపమని తొలుత తన సోదరికి సంక్షిప్త సందేశాన్ని పంపాడు. ఆ తర్వాత ఓ లేఖ కూడా రాసినట్టు తెలిసింది.

ఈ ఘటనలో బాలుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి నుంచి రూ. 9.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై శిశు సంక్షేమ కమిటీ అధికారులకు సమాచారం అందడం వల్ల.. ఆ అబ్బాయిని, తండ్రిని కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదీ చదవండి: 'ఆత్మహత్య' కేసులో అర్నబ్ గోస్వామి అరెస్టు

Last Updated : Nov 4, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.